సినిమాల్లో హీరోలు విలన్లను పట్టుకోవడానికి బైక్స్, కార్లలో ఛేజింగ్ చేస్తు ఉండే సీన్లు గుర్తు ఉన్నాయి కదా..కొన్ని సందర్భల్లో హీరో తన వాహనం నుంచి ఎగిరి విలన్ వాహనాలపై పడి అతన్ని పట్టుకుంటారు.  ఇలాంటి సీన్లు హాలీవుడ్ లో బాగా చూపిస్తుంటారు..వాస్తవానికి ఇవన్నీ గ్రాఫిక్స్ మాయాజాలం. కానీ ఇలాంటి సీన్లు నిజంగా బయట జరిగితే..అవునండీ ఇలాంటి చేజింగ్ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  

పాకిస్తాన్ లో  ఓ ట్రక్ డ్రైవర్ లారీ ఢీ కొట్టి అత్యంత వేగంగా పారిపోతుండగా బైక్ పై పోలీస్ వెళ్లి  డ్రైవర్ ను పట్టుకోవడానికి  యత్నించాడు. దీంతో ఆ డ్రైవర్ తన వాహనాన్ని మరింత స్పీడుగా నడిపినప్పటికీ, ట్రక్కు ఫుట్ రెస్ట్ పైనే నిలబడిన ఆ పోలీసు బెదరలేదు. ప్రాణాలకు తెగించి అలాగే వేలాడాడు. బైక్ వెళ్తున్న ఓ వ్యక్తి దీన్ని తన సెల్ లో వీడియో తీశాడు.

ఇక ఇంత కన్నా వేగంగా వెళితే ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొని తన ప్రాణాలు పోతాయని భావించిన డ్రైవర్ తప్పని పరిస్థితిలో పక్కకు ఆపడంతో ఆ డ్రైవర్ తీసుకొచ్చి కటకటాల్లో వేశాడు పోలీస్. నిజంగా ఆ పోలీస్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: