భారత దేశంలో ఎన్నో దేవాలయాలు కొలువై ఉన్నాయి.  అయితే కొన్ని దేవాలయాలు మాత్రం ఎంతో ప్రసిద్ది గాంచాయి.  ఇక భారత దేశంలోనే అత్యంత శిల్పకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో.  అయితే ఖజురహో టెంపుల్‌పై శృంగార భంగిమల శిల్పాలుండడంతో ఇది మరింత ప్రసిద్ది గాంచింది.  కొత్తగా వివాహం అయిన వారు ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు.  
Image result for KHAJURAHO TEMPLE
ఆ కాలంలో శృంగారంలో సందేహాలు ఉన్న వారి కోసం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతుంటారు.   ఈ మద్య ఖజురహో టెంపుల్ వద్ద కామసూత్ర పుస్తకాలు అమ్ముతున్నట్లు వార్తలు వచ్చాయి.  కొంత మంది వ్యాపారస్తులు ఇక్కడకు వచ్చిన  యువకులకు కామసూత్ర పుస్తకాలు అమ్మి క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుసుకున్న జరంగ్ సేన టెంపుల్ వద్ద ఇలాంటి పుస్తకాలు అమ్మకూడదని డిమాండ్ చేసింది.
Image result for KHAJURAHO TEMPLE
ఐతే, పురావస్తు శిల్ప కళా ప్రాభవాన్ని చాటిచెబుతున్న ఈ ఆలయ ఆవరణలో ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలంటూ ఛాతర్‌పూర్ పోలీసులకు సేన సభ్యులు ఫిర్యాదు చేశారు. వరల్డ్ హెరిటేజ్‌గా ఈ టెంపుల్ ని యునెస్కో గుర్తించిందని, పవిత్ర ప్రదేశాల్లో ఇలాంటి పుస్తకాల అమ్మకాలు సబబు కాదని బజరంగ్ సేన ఆందోళన వ్యక్తంచేసింది.  పర్యాటక శాఖతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: