ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రజాదారణ పొందుతున్న నాయకుడు కేటీఆర్. ఇటీవల కాలంలో కేటీఆర్ ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆ అనుభూతులను ఆయన సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు. సోషల్ మీడియా లో ఆయనకు నెటిజన్ల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో రెండు ప్రధాన శాఖలు ఉన్నా ఆయన సామాన్యులతో మమేకం అవ్వడం నిజంగా ప్రశంసించ దగిందే. 



సిరిసిల్లా జిల్లాలోని గాంధీన‌గ‌ర్‌లో 55ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఆధునికీక‌రించిన కూర‌గాయ‌ల మార్కెట్‌ను ఈ రోజు తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాజకీయ జీవితం ఉన్నంత వరకూ ఇక్కడి ప్రజలతోనే కలిసి ఉంటానని, చేనేత కార్మికులు గౌరవంగా బతికే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకోసం నేత కార్మికుల సంక్షేమానికి రూ.200 కోట్లు ఇచ్చామని కేటీఆర్‌ తెలిపారు.



వచ్చే దసరా నాటికి 400 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కూర‌గాయలు అమ్ముతోన్న వ్య‌క్తుల‌తో కేటీఆర్ ముచ్చ‌టించారు. వారు చేస్తోన్న చిరు వ్యాపార లాభ, న‌ష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వర్షాకాలంలో మిడ్ మానేర్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని, ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆయన ఇవాళ అనేక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: