ఆ మద్య శ్రీకృష్ణుడు, గణేషుడు పాలు తాగారని వార్తలో యావత్ భారత దేశంలో దావానంలా వ్యాపించింది.  దీంతో ఎంతో మంది భక్తులు ఆయా విగ్రహాలకు పాలు పోయడం ఆరంభించారు..కానీ ఎక్కడా పాలు దేవతా విగ్రహాలు పాలు తాగిన దాఖలాలు కనిపించలేదు.  తర్వాత అదంతా కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టి పడేశారు.  ఇక కొన్ని చోట్ల మేరీ, జీసస్ కన్నీటి వెంట రక్తం కారుతుందని వార్తలు వస్తున్నాయి.  

తాజాగా  వరంగల్‌ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు గుంటూరుపల్లిలోని లూర్ధుమాత దేవాలయంలో మేరీ మాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు, రక్తం లాంటి ద్రవం కారుతుండడం వైరల్ గా మారింది. బుధవారం ఉదయం ఈ విగ్రహం కళ్ల నుంచి రక్తం రూపంలో ఉన్న కన్నీరు రావడాన్ని చర్చి ఫాదర్ గుర్తించారు.  
mary matha_apdunia
ఆ నోటాఈనోటా విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో తండోపతండాలుగా మేరీ మాత విగ్రహన్ని సందర్శించుకుంటున్నారు.  ఈ విషయం ఇన్‌చార్జ్‌ బిషప్‌ జోసఫ్‌కు సమాచారం అందించగా ఆయన మేరీమాత విగ్రహాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: