ప్రభుత్వ అధికారుల ప్రధాన విధి తమ విధులను సక్రమంగా నిర్వర్తించడమే. కానీ సక్రమంగా పని చేస్తున్న అధికారులను ప్రభుత్వం ఏ చేస్తుంది..? సత్కరిస్తుందా..? అధికార మదంతో బదీలీ చేస్తుందా..? అంటే పోలీస్ విభాగం తప్ప ఇతర విభాగాల అధికారులను సత్కరించగా.. పోలీస్ అధికారులను మాత్రం బదిలీ చేస్తుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. పోలీస్ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోతున్న నేటి ఆధునిక యుగంలో ఎవరో ఒకరు ఎపుడో అపుడు అన్నట్టుగా తమ విధి నిర్వాహనను సక్రమంగా నిర్వర్తిస్తుంటే..వాటి పై బదిలీ వేటు వేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు రాజకీయ నాయకులు. 



బాధ్యతలను నిజాయితీగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ మహిళా పోలీసు అధికారి శ్రేష్ట ఠాగూర్‌పై బదిలీ వేటు పడింది. ఆమెను బహ్‌రైచ్‌కు బదిలీ చేశారు. యూపీలో అధికారం తమదేనన్న ధైర్యంతో నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రమోద్ కుమార్‌కు శ్రేష్ట ఠాకూర్‌ ఇటీవల ముచ్చెమటలు పట్టించారు. సమాధానం చెప్పి వారిని జైలుకు పంపి అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు అధికారిణి శ్రేష్ఠా ఠాకూర్‌ బదిలీ అయ్యారు.



బులంద్‌షెహర్‌లోని స్యానా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమెని బహ్రైచ్‌కి బదిలీ చేశారు. ఇటీవల స్థానిక భాజపా నేతలు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకుండా పట్టుబడడంతో వారికి జరిమానా విధించారు. ఠాకూర్‌ చర్యను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్థానిక బీజేపీ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారం కూడా తిరక్కుండానే శ్రేష్ట ఠాకూర్‌పై అధికారులు బదిలీ వేటు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: