అధికార పార్టీ నేతలైనా, ప్రతిపక్ష పార్టీల నేతలైనా, ఉన్నత ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఒక కొత్త వ్యక్తి భారతదేశం గర్వించే ఉన్నతమైన పదవులను అలంకరిస్తున్నారంటే చాలు వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నాయకుల తాకిడి ఒక్క సారిగా మొదలవుతుంది. ప్రధాని మోడీ ఇక ప్రధాని అవడం ఖాయం అని అనుకునే సమయంలో కూడా రాజకీయ వర్గాల్లో ఇలాంటి వాతావరణమే కనబడింది. సరిగ్గా మళ్లీ ఇలాంటి పరిస్థితి కాబెయే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు ఎదురవడం మనం నేడు టీవీల్లో, పత్రికల్లో ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ హైదరాబాద్‌లో అధికార విపక్ష పార్టీలతో సమావేశం అయ్యారు.



ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా జగన్ అంటీముట్టనట్టు వ్యవహరించే వ్యక్తిగా కనిపిస్తారు. కరచాలనం కూడా చాలాసార్లు అంత చురుగ్గా చేయరు. అలాంటిది కోవింద్ వచ్చీరాగానే విష్ చేస్తూనే... ఇలా పాదాభివందనం చేశారు. బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నారు. ఓటు వేస్తామన్నందుకు కృతజ్ఞత చెప్పేందుకు ఆయన వస్తే జగన్ ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తి రేపింది.  



ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉన్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ అధికార ప్రతినిధి మురళీధర్ రావులు హాజరయ్యారు. భేటీ సందర్భంగా కోవింద్ కు శాలువా కప్పి జగన్ సత్కరించారు. పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు మీకేనని జగన్ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: