ఇప్పటివరకు అమ్మాయిలు, అబ్బాయిలు పారిపోయి పెళ్లి చేసుకొవడం ఇప్పటివరకు చాలా సార్లు విన్నాం. కానీ మహిళలు ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కడ కూడా చదివి ఉండం. సమాజం రోజు రోజుకు ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల ఆలోచనలు మాత్రం వికృత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఈ విచిత్ర సంఘటన బెంగుళూరు లో చోటు చేసుకుంది. తాము ‘లెస్బియన్‌’ (స్వలింగ సంపర్కం కలిగి వుండే స్త్రీ)ల మంటూ ఇప్పుడు వేరు కాపురం పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆ న‌గ‌రంలోని విజయనగర్‌లో రెండు కుటుంబాలు ప‌క్క‌ప‌క్క ఇళ్ల‌లో నివ‌సించేవి. బంధువులైన వారిద్ద‌రి ఇళ్ల‌లో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉండేవారు. 


అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం

బంధువులైన వారిద్దరూ వరుసకు అక్క, చెల్లెలు. వీరిలో ఒకరు ప్రైవేటు కాలేజీలో బీ.కాం చదువుతుండగా, మరొకరు కాల్‌సెంటర్‌లో ఉద్యోగిని.రెండేళ్ల నుంచి ఇద్దరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. బీకాం విద్యార్థిని అబ్బాయిలాగ ప్రవర్తిస్తూ కాల్‌సెంటర్‌ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఒత్తిడి చేస్తూ వచ్చింది. మొదట కాల్‌సెంటర్‌ ఉద్యోగిని ఆమె ‍ప్రవర్తనను చూసి తమాషా చేస్తోంది అనుకుంది. అయితే కొంతకాలానికి ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ప్రేమ‌ప‌క్షుల్లా అన్ని చోట్లా తిరిగేవారు. ఇద్ద‌రూ అమ్మాయిలే కావ‌డంతో త‌మ ఇళ్ల‌ల్లో త‌మ పెళ్లికి అంగీక‌రించ‌బోర‌ని గ‌త నెలలో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.


Image result for lsbiyan

న‌గ‌రంలోని కోరమంగళలో వారు కాపురం పెట్టి సహజీవనం చేస్తున్నారు. వారిలో బీకాం విద్యార్థిని తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో పోలీసులు ద‌ర్యాప్తు చేసి అస‌లు విష‌యాన్ని క‌నిపెట్టారు. పైగా వీరిద్దరూ మేజర్లు కావడంతో ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని వనితా సహాయవాణిని ఆశ్రయించడంతో సీనియర్‌ కౌన్సిలర్‌ బీ.ఎస్‌.సరస్వతి ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: