రాజకీయ నాయకులే కాదు ఎవ్వరైనా సరే ఆవేశం లో మాట్లాడితే తప్పులు దొర్లడం సహజమైన విషయం. దీనికి ఏ నాయకుడూ అతీతుడు కానే కాదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విషయం లో మాత్రం ఆ తప్పులు మరికాస్త ఎక్కువ హై లైట్ అవుతూ కనిపిస్తాయి. జగన్ మోహన్ రెడ్డి మీడియా సాక్షి లో ఈ తప్పులు ఒకటికి పదిసార్లు చూపిస్తూ ఉంటారు.


కానీ ఇలాంటి టైం లోనే హుందా తనం ఏంటో బయట పడుతుంది అంటున్నారు నారా లోకేష్. నాలుగు మాటలు ఒకేసారి మాట్లాడే టైం లో ఎవ్వరికైనా సరే తప్పులు దొర్లడం సహజం అనీ ఒక్క పదం అటూ ఇటూ గా మాట్లాడితే మొత్తం భావాన్ని వక్రీకరించి చూడకూడదు అని ఆయన అంటున్నారు. అట్లా చేసే మేము దుమ్మెత్తిపోయొచ్చు.


వాళ్ళు చేసిన వ్యాఖ్యలన్నీ బయటకు తీస్తే ఎన్ని తప్పులు చేసారో తెలుస్తుందని చెప్పిన లోకేష్, ఏకంగా జగన్ చేసిన తప్పుకు కౌంటర్ వేసారు. ‘మల్టిప్లికేషన్ లేని వారు కూడా ఆ పార్టీలో ఉన్నారంటూ’ గతంలో అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన ‘మల్టిప్లికేషన్’ తప్పును ప్రస్తావించారు లోకేష్. ఇలాంటి అవసరం లేని మాటలకి మీడియా ప్రాధాన్యం ఇవ్వడం కూడా అనవసరం అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: