తలనుండు విధము ఫణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకున్ తలతోక యనక యుండును-ఖలునకు నిలువెల్లవిషము గదరా సుమతి!


సర్పానికి తలలో తేలుకు తోకలో తల తోక అనే కాకుండా దుర్మార్గునికి దేహమంతా విషము నిండి ఉంటుందని సుమతీ శతకకారుడు వివరించాడు. అయితే డ్రాగన్ విషసర్పానికే కాదు దాని మీడియాకి కూడా దేహమంతానే కాకుండా అలోచనల నిండాకూడా విషం పొంగిపోరలుతుంది. 

Image result for china india war

డోక్లామ్ ప్రాంతం విషయంలో భారత్, చైనా మధ్య ఉన్న సమస్య కొలిక్కి రాకుంటే యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని చైనా నిపుణులు మీడియాతో చెప్పారు.  ఈ సమస్య ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో రగులుతూ ఉందని, ఈ విషయంలో ఎలాంటి తేడా జరిగినా మరోసారి యుద్ధ వాతావరణాన్ని తోసిపుచ్చలేమంటూ గ్లోబల్ టైమ్స్ అనే మీడియాకు అక్కడి నిపుణులు చెప్పారు. తన సార్వభౌమాత్వాన్ని సంరక్షించుకునే విషయంలో చైనా యుద్ధం సంభవించినా పర్వాలేదనే భావనతో ఉందని తెలిపారు. ‘ఇటీవల చైనా, భారత్ కు  మధ్య ఏర్పడిన సమస్యను సరిగా పరిష్కరించకుంటే మాత్రం యుద్ధం కూడా సంభవించే అవకాశం ఉంది. సరిహద్దు విషయంలో, సార్వభౌమత్వం విషయంలో దేన్నయినా ఎదుర్కోవాలని చూస్తోంది’  అని అక్కడి గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.


డోక్లామ్ ప్రాంతం విషయంలో భారత్ వెనక్కి తగ్గాలని, చరిత్ర తెలుసుకొని ముందుకు నడవాలంటూ చైనా విదేశాంగమంత్రి అన్న నేపథ్యంలో 1962 నాటి భారత్ మాత్రం కాదని అరుణ్ జైట్లీ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో చైనా కూడా 1962 నాటి చైనా కాదని వాంగ్ డెహువా అనే ప్రొఫెసర్ అన్నారు. చైనాతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే భారత్ తన ప్రతికూల వైఖరిని మార్చుకోవాలని కోరారు.

Related image

సిక్కిం సెక్టార్లో ఉండే ‘డోకా-లా’ కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ చైనా ఓ మ్యాప్ ను విడుదల చేసింది. భారత సైనికులు తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని చైనా ఆరోపించినప్పుడు భారత సైనికులు వెళ్లింది ఈ కనుమ వద్దకే. కొన్నిరోజుల క్రితం భారత్, చైనా సైనికులు కలబడిందీ ఇక్కడే. డోకా లాను చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాంతం "భారత్, చైనా, భూటాన్ మూడు దేశాల సరిహద్దు" లో ఉంటుంది.


కానీ 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో చైనీయులు తమ పశువులకు గడ్డి మేపు తున్నారనీ, ఒకప్పుడు భూటాన్ ప్రజలు ఇక్కడ గడ్డికి రావాలంటే అప్పటి తమ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండేదని చైనా పేర్కొంది.

Image result for డోకా-లా కనుమ

డోకా-లా కనుమ తమదే అని చెప్పడానికి ఈ రుజువులు సరిపోతాయంది. మరోవైపు సిక్కిం సెక్టార్లో భారత్–చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు భారత్ హాజరైంది. ఉగ్రవాదంపై పోరాటం, ప్రత్యేకతావాదం, తీవ్రవాదం సహా పలు అంశాలపై ఎస్సీఓ సదస్సులో చర్చలు జరిగినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.  డోకా లా కనుమ తమదే అని చెప్పడానికి ఈ రుజువులు సరిపోతాయంది. మరోవైపు సిక్కిం సెక్టార్లో భారత్–చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు భారత్ హాజరైంది. ఉగ్రవాదంపై పోరా టం, ప్రత్యేకతావాదం, తీవ్రవాదం సహా పలఅంశాలపై ఎస్సీఓ సదస్సులో చర్చలు జరిగినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

Image result for డోకా-లా కనుమ

భారత్, చైనా సరిహద్దుల్లో ఎందుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి? వివాదాస్పదమైన అరుణాచల్ ప్రదేశ్ లేదా లడక్ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా ఎలాంటి సరిహద్దు వివాదంలేని సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు రాజుకున్నాయి. ఎప్పుడూ ఇరువైపుల పదుల సంఖ్యలో కాపలా ఉండే సైనికుల సంఖ్య ఇప్పుడు మూడువేల మందికి ఎందుకు చేరుకుంది? ఒకసారి 1962లో ఎదురైన పరాభవాన్ని గుర్తుచేసుకోడంటూ భారత్ ను చైనా హెచ్చరించడం, అప్పటి భారత్  లాగానే ఇప్పుడూ భారత్ ఉందనుకోవడం పొరపాటంటూ భారత్ కూడా దీటుగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? చైనా సరిహద్దుల గుండా మానస సరోవర్ యాత్రను కూడా నిలిపేయాల్సిన ఆగత్యం ఎందుకు ఏర్పడింది?


భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసేచోటును "డోకో–లా" అని భారత్,"డాగ్లాంగ్ అని చైనా పిలుస్తోంది. వీటి సరిహద్దులను నిర్దేశిస్తూ 127 సంవత్సరాల క్రితమే, అంటే 1890 సంవత్సరంలో అప్పటి క్వింగ్ రాజ్యం, బ్రిటీష్ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లేయులు, చైనీయుల మధ్య కుదిరిన ఒడంబడికగా అప్పటి నుంచి పరిగణిస్తున్నారు. ఈ సరిహద్దులకు సమీపంలోనే ఉన్న టిబెట్లోని చుంబాలోయ చైనాకు వ్యూహాత్మకమైన ప్రదేశం. చైనా నుంచి ఆ ప్రాంతాని కి చేరుకోవడానికి సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి మోటార్లపై వేగంగా చేరుకోవడానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది.

Image result for డోకా-లా కనుమ

జూన్ నాలుగవ తేదీ రాత్రి భారత్ సైనికులు టిబెట్లోని చుంబా లోయలోకి చొచ్చుకుపోయి చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డగించారని చైనా ఆరోపిస్తోంది. అందుకు ప్రతీకారంగా కొన్ని రోజుల తర్వాత చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి జొరబడు రెండు బంకర్లలో ఒక బంకరు ను బుల్డోజర్తో కూల్చేశారని ఆ దేశ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగా నిర్మించారన్న కారణంగా తాము కూల్చేశామని చైనా సైన్యం సమర్థించుకుంటే ఆ బంకర్లు ఎప్పుడో నిర్మించినవని భారత్ వాదించింది. చైనా నిర్మిస్తున్న రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్ ఒక ప్రమాదం. చైనాతో భూటాన్ కు దౌత్య సంబంధాలు లేని కారణంగా భారత్ పంచన చేరిన ఆ దేశం రోడ్డు నిర్మాణాన్ని నిలిపి వేయాల్సిందిగా భారత్ ను కోరి ఉండవచ్చు. అందుకు భారత సైన్యం స్పందించి ఉండవచ్చు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఏ దేశమూ వెల్లడించడం లేదు. 


సరిహద్దులు అతిక్రమించి రోడ్డు నిర్మాణం అడ్డుకున్నావంటూ భారత్  పై చైనా, సరిహద్దుల్లోకి చొరబడి బంకరు కూల్చేశావంటూ చైనాపై భారత్ ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇవి తీవ్రస్థాయికి చేరుకోవడంతో వేలాది మంది సైనికుల మోహరింపుతో ముఖాముఖి తలపడే స్థాయికి చేరుకున్నాయి. సిక్కింకు సంబంధించినంతవరకు తమకు భారత్ తో ఎలాంటి వివాదం లేదని, ఇప్పుడు కూడా తమ దేశం 1890 నాటి ఒప్పందాన్ని గౌరవిస్తున్నామని చైనావిదేశాంగ శాఖ స్పష్టంచేయడం గమనార్హం. అలాంటప్పుడు ఇరుదేశాలుఎందుకు ఉద్రిక్తకు దారితీసే ప్రకటనలు చేస్తున్నాయి? 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాంగ విధానంలో దూకుడు స్వభావాన్నే ప్రదర్శిస్తోంది. అందుకే చల్లారిన కశ్మీరం మళ్లీ రగులుతోందని, ఇప్పుడు చైనాతో కయ్యానికి కాలుదువ్వుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశ సమస్యల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ఈ దూకుడు విధానమని వారంటున్నారు.

Image result for డోకా-లా కనుమ

అలాంటప్పుడు మరి చైనా ఎందుకు దూకుడు స్వభావం ప్రదర్శిస్తోంది? పాకిస్తాన్ మీదుగా చైనా నిర్మిస్తున్న ‘ఒకే బెల్ట్ ఒకే కారిడార్’ ప్రాజెక్టుకు భారత్ భవిష్యత్లో అడ్డు రాకూడదని ఉద్దేశంతో వ్యూహాత్మకంగా చైనా దూకుడు వైఖరిని అవలంబిస్తోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తుండగా, వివాదాస్పదమైన అరుణాచల్ ప్రదేశ్లో భారత్ మౌలిక సౌకర్యాల నిర్మాణం పట్ల చైనా ఆగ్రహంతో ఉందని, ఆ అగ్రహాన్ని ఇక్కడ చూపిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. భారత్ సైన్యం ప్రధానంగా సరిహద్దు కదలికలపై దష్టి పెట్టేలా చేసి సిక్కిం లోని అపార సహజ వనరులను దోచుకుపోవాలని చైనా చూస్తోందంటూ ఢిల్లీ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజేష్-దేవ్ అభిప్రాయపడ్డారు               

మరింత సమాచారం తెలుసుకోండి: