అక్కినేని నాగార్జున సినిమాల్లో, బిజినెస్ లో కూడా చాలా ప్లాన్డ్ గా ఒక పద్దతిలో నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నాగార్జున రాజకీయాలలోకి కూడా ప్రవేశిస్తారని టాక్. వైఎస్ జగన్, అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పరంగా, బిజినెస్ పరంగా ఇద్దరికి సన్నిహిత సంబంధాలు బాగున్నాయి. నాగ్‌‌కు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు.



కాంగ్రెస్ పథకాలను ఫ్రీగా ప్రచారం చేశారు కూడా. నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని ప్రేమించిన అమ్మాయి శ్రియా భూపాల్‌రెడ్డి స్వయానా జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలు. జీవికే రెడ్డి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి బాగా స‌న్నిహితులే కాక‌, బంధుత్వం కూడా ఉంది. ఆ బంధుత్వంతో  నాగార్జున వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. 2109 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.



అంతే కాకుండా గుంటూరు పార్లమెంట్ సీటు నుండి నాగార్జున ని పోటీ చెయ్యపించాలని జగన్ బావిస్తున్నాడని, అందుకు నాగార్జున సైతం సిద్దంగా ఉన్నాడని ఇన్నర్ టాక్. నాగార్జున ఎన్నికల్లో గెలిస్తే కీలకమైన రాజధాని ప్రాంతంలో, గుంటూరు కారిడార్‌‌లో తన వ్యాపార సామ్రాజ్యం కూడా పెంచుకోవచ్చనేది మరో అంచనా. అయితే ఈ విషయంపై నాగార్జున మాత్రం ఎక్కడా పెదవి విప్పడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: