Image result for high court of ap & alla ramakrishna reddy


సమైఖ్య ఆంధ్రప్రదేశ్ విభజనానతరం ఏర్పడ్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నిర్వాకంలో నడుస్తున్న భూ కుంభకోణా లకు సదావర్తి భూముల కుంభకోణం ఒక ఉదాహరణగా నిలిచింది. అత్యంత దుర్మార్గంగా తెలుగు దేశం ప్రభుత్వం తనవారికే సదావర్తి భూములను అత్యంత చవక ధరలకు కట్టబెట్టటం పంచి పెట్టటం తెలుగు ప్రజల దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. న్యాయస్థానం లో 'పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్' క్రింద కేసు వేయటం ద్వారా భూమి ధరని అతి చవకగా కట్టబెట్టినట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లోనే ఋజువైంది. 


Image result for high court of ap & alla ramakrishna reddy


సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 10 కోట్లు చెల్లించేందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంగీకరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ పేరు మీద ఈ మొత్తాన్ని చెల్లించాలని రామకృష్ణారెడ్డికి కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ వారంతం లోపే రూ. 10 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా మని కోర్టు వెలుపల ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో చెప్పారు.


Image result for high court of ap & alla ramakrishna reddy 

గతవారం ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కొంత మంది పెద్దలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 22 కోట్లకు ధారాదత్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు ఇస్తే మీకే భూములు కేటాయిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అదనంగా చెల్లించాల్సిన రూ. 5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించారు. అలా అయితే మొదటి విడత కింద రూ. 10 కోట్లను రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారా ల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా రూ.10 కోట్లు చెల్లించేందుకు  ఎమ్మెల్యే ఆర్కే సిద్ధమయ్యారు. 


దీన్నిబట్టి జాతి సంపద ఎంతగా ఆవిరి ఔతుందో ముఖ్యమంత్రి చెప్పాలి!


Image result for high court of ap & alla ramakrishna reddy

మరింత సమాచారం తెలుసుకోండి: