వైసీపీ నాయ‌కురాలు రోజాకు పార్టీ అధినేత జ‌గ‌న్.. హోం మినిస్ట‌ర్ ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారా? వైసీపీ అధికారంలోకి వ‌స్తే సెకండ్ ప్లేస్ రోజాకే ఇవ్వ‌బోతున్నారా? అందుకే రోజా పార్టీ మారే ఆలోచ‌న‌కు బ్రేక్ వేసిందా? అవున‌న‌నే అంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. 


అధికారం లోకి వస్తే రోజాకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ మహిళా నేత అయిన సబితా ఇంద్రారెడ్డికి వై ఎస్ హోంమంత్రి పదవి కట్టబెట్టారు. అదే సెంటిమెంట్ రోజాకు కలసివచ్చే అవకాశం ఉన్నట్లు వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
జ‌న‌సేన పార్టీలోకి చేర‌బోతోంద‌నే వ‌స్తున్న‌ వార్త‌లను తాజాగా ఖండించింది రోజా. టిడిపి, జనసేన పార్టీ లలో చేరడానికి నేనేమి అంత పిచ్చిదానిని కాదని రోజా అన్నారు. పవన్ జనసేన పార్టీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు.

కేవలం తన కులం వలన తనని చంద్రబాబు తొక్కేయడానికి ప్రయత్నించే క్రమంలో జగన్ తనని ఓ సోదరుడిలా ఆదుకున్నారని ఆమె అన్నారు. తన జీవితంలో జగన్ ని విడిచి వెళ్లనని రోజా స్ప‌ష్టం చేశారు. మొత్తానికి రోజాకు వైసీపీలో మంచి స్థాన‌మే ల‌భించ‌బోతోంద‌నే క్లారిటీ మాత్రం క‌నిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: