మహాత్మాగాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణగాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 18 ప్రతిపక్ష పార్టీలు ఎంపిక చేశాయి. 


గోపాలకృష్ణ గాంధీ గురించి... 
వయస్సు : 72, 
పుట్టిన తేది: ఏప్రిల్ 22, 1945
భార్య: తార, 
పిల్లలు: దివ్య, అమృత
విద్య: ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ (స్టీఫెన్స్ కాలే జీ, ఢిల్లీ యూనివర్సిటీ)
ప్రస్తుతం: అశోకా యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రం, చరిత్ర, భారత సంస్కృతి అంశాలపై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు
ఆయన పలు నవలలు, నాటకాలు, పత్రికల్లో వ్యాసాలు రాశారు.
-చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చైర్మన్‌గా పనిచేశారు (2011-14)
-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి చైర్మన్‌గా, సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు (2012-14)
-1968లో ఐఏఎస్ అధికారిగా చేరి 1985 వరకు తమిళనాడులో విధి నిర్వహణ
-1985-87 వరకు భారత ఉపరాష్ట్రపతికి కార్యదర్శి
-1987-92 వరకు భారత రాష్ట్రపతికిసంయుక్త కార్యదర్శి
-1997-2000 వరకు రాష్ట్రపతికి కార్యదర్శి


దౌత్యవేత్తగా..
-1992లో బ్రిటన్‌లోని భారత హైకమిషన్‌లో సాంస్కృతిక శాఖ ప్రతినిధి
-లండన్‌లోని నెహ్రూ సెంటర్‌కు తొలి డైరెక్టర్
-1996లో దక్షిణాఫ్రికా, లెసోతో దేశాల్లో భారత హైకమిషనర్
-2000లో శ్రీలంకలో భారత హైకమిషనర్
-2002లో నార్వే, ఐస్‌ల్యాండ్‌లకు భారత రాయబారి
-2003లో ఐఏఎస్‌గా పదవీ విరమణ


గవర్నర్‌గా
-2004, డిసెంబర్ 14న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు
-2006లో కొంతకాలం బీహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు


మరింత సమాచారం తెలుసుకోండి: