ట్రాఫిక్ ఈ చాలాన్లు ఏంటి.. కాపురాల్లో చిచ్చు పెట్టడం ఏంటి..? అనే గా మీ డౌటు అవును మీరు చదువుతున్నది పచ్చి నిజం, ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా వాహనం నడుతుపుతున్న వారి ఫోటోతో సహా ఆధారాలను చూపుతూ ఇంటికి చలానా పంపిస్తుంది పోలీస్ యంత్రాంగం. అయితే సరిగ్గా ఇలాగే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో ఇటీవలే ఓ వ్యక్తి ఇంటికి చలానా రాగా, ద్విచక్ర వాహనంపై తనకు బదులు మరో మహిళ ఉండడాన్ని సదరు వ్యక్తి భార్య గుర్తించింది.


Image result for traffic e challan

ఇక అంతే బైక్ పై వెనక కూర్చున్న మహిళ ఎవరు..? అని భర్తను ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఆ మహిళ మొఖానికి ముసుగు వేసుకోవడం వల్ల మొఖం గుర్తుపట్టడానికి వీలులేకపోవడంతో ఎవరో మహిళను ఎందుకు బైక్ పై ఎక్కించుకున్నావని నిలదీసింది. అయితే భార్య ప్రశ్నకు భర్త సమాధానమిస్తూ.. ఆ మహిళ తన ఆఫీసుకు సంబంధించిన వ్యక్తి అని ఆమె లిఫ్ట్ ఇవ్వమని కోరగా సహాయం చేశానని బదులిచ్చాడు. అయితే భర్త మాటలు నమ్మశక్యంగా లేవన భార్య పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. 


Image result for traffic e challan

తన భర్త బైకుపై ముఖానికి దుపట్టా ధరించి కూర్చున్న మహిళ ఎవరో తేల్చాలని ఆమె పోలీసులను ప్రాధేయపడింది.పోలీసులు మాత్రం అతడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫోటోల కారణంగా చాలా వివాహేతర సంబంధాలు బయటకు వస్తున్నాయని పోలీసులు చెప్పడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: