ఆమె పేరు అర్చన.. దూర విద్యా విధానంలో సైకాలజీలో పీజీ చేస్తోంది.. తరచూ సిటీకి వచ్చి వెళ్లే ఈమె ఓ చోరీని చూసి తానూ దొంగగా మారింది. ఆమె గతంలో కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీలో నివాసం ఉండేది. ఉస్మానియా దూరవిద్య కేంద్రం ద్వారా ఎంఏ సైకాలజీ చదువుతోంది. ఇక్కడ ఉన్న సమయంలో కూకట్‌ పల్లి నుంచి పంజాగుట్ట ప్రాంతాల మధ్య సిటీ బస్సుల్లో తిరుగుతూ తోటి ప్రయాణీకుల బ్యాగుల నుంచి నగదు, నగలు, విలువైన వస్తువులు, ఏటీఎం కార్డులను దొంగిలించేది. గత ఆరు నెలల్లో మూడు దొంగతనాలు చేసింది.. చివరకు మంగళవారం ఎస్సార్‌నగర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కిందని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. 


Image result for women shadow

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఓ ప్రయాణీకురాలి బ్యాగులో నుంచి ఏటీఎం కార్డును దొంగిలించింది. మూసాపేటలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఏటీఎంలో రూ. 10 వేల నగదును డ్రా చేసింది. ఏటీఎం కార్డు కోల్పోయిన బాధితురాలు మూసాపేటలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో తన కార్డును ఉపయోగించి డ్రా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి అర్చనను అదుపులోకి తీసుకున్నారు. తాను పీజీ విద్యార్థినని, తమది సంప్రదాయ కుటుంబమని, తనపై అనవసరంగా నేరం మోపుతున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి న అర్చన.. వారితో వాగ్వాదానికి దిగింది.


Image result for women shadow

పోలీసులు ఆధారాలు చూపడంతో చివరికి నేరం అంగీకరించింది. అర్చనను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె నుంచి 8.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా స్వస్థలమైన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో అర్చన కుటుంబం తో కలసి ఉంటోంది. ఈమె తండ్రి ప్ర భుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా రు. సిటీకి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న అర్చనను ఓ ‘సీన్‌’ఆకర్షించింది. ఓ మహిళా దొంగ రద్దీ బస్సులో చోరీ చేయడం చూసి తానూ అదే పని చేయాలని నిర్ణయించుకుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: