వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు పూర్తి అస్త్ర‌శ‌స్త్రాల‌తో రెడీ అయిపోతున్నారు. త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నార్త్‌లో ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో స‌క్సెస్ ఫుల్ వ్యూహాలు అందించిన ప్ర‌శాంత్ కిషోర్‌ను త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నారు. జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు రంగంలోకి దిగిన పీకే ఇప్ప‌టికే ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే ప‌నులు స్టార్ట్ చేసేశారు. ఇక ఇప్ప‌టికే కొంత‌మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వేలు కంప్లీట్ చేసి జ‌గ‌న్‌కు నివేదిక కూడా ఇచ్చిన‌ట్టు సమాచారం.

Image result for ysrcp

స‌ర్వే చేసే క్ర‌మంలో పీకే కొంత‌మందిని బృందాలుగా విభ‌జించి జిల్లా, న‌గ‌ర‌, మండ‌ల‌, గ్రామ‌స్థాయిల్లో వారిచేత స‌ర్వేలు చేయిస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ నుంచే జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ఈ స‌ర్వేలో చాలా మిస్టేక్‌లు క్లీయ‌ర్‌గా తెలుస్తాయ‌న్న చ‌ర్చ‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. 

Image result for ysrcp jagan prashant kishor

ఈ స‌ర్వే బృందాల్లో ఉంటోన్న వారిలో ఢిల్లీ, బిహార్‌, ఒడిశా రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా ఉంటున్నారు. వారు స్థానిక భాష కోసం ఎక్కువుగా స్థానికంగా ఉండే వైసీపీ క్యాడ‌ర్‌పై ఆధార‌ప‌డుతున్నారు. ఇక వీరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లీ వెళ్ల‌గానే స్థానికంగా ఉన్న వైసీపీ నేత‌ల ఇళ్ల‌లో తిష్ట వేస్తున్నారు. వాళ్లు పెట్టిన‌వి తింటూ.. వాళ్లు ఇచ్చినవి తాగుతూ.. చివ‌రికి వారు చెప్పిన స‌మాచారాన్నే న‌మోదు చేసుకుని వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. 

Image result for ysrcp jagan prashant kishor

వైకాపా ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ఇళ్ల‌ల్లో ఉన్న‌ప్పుడు వాళ్ల‌కు ఈ సర్వే బృందాలు త‌ప్ప‌కుండా ప్ర‌భావితం అవుతాయ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక అలాంట‌ప్పుడు ఆ స‌మాచారంలో అంతా పాజిటివ్ ఫీడ్ బ్యాకే ఉంటుంది గాని, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్క‌డ నుంచి వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

Image result for ysrcp jagan prashant kishor

మ‌రి జ‌గ‌న్ ఏకంగా భారీ డీల్ కుదుర్చుకుని నియ‌మించుకున్న పీకే ప్రాథ‌మికంగానే ఈ త‌ప్పుల‌తో స‌ర్వే చేస్తే అది జ‌గ‌న్ తీసుకునే డెసిష‌న్ల‌తో పాటు 2019 ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌పై ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూప‌డం ఖాయం. మ‌రి ఈ లోపాల‌ను పీకే ఎప్ప‌ట‌కి స‌రిదిద్దుకుంటాడో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: