తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.  తెలంగాణ పోరాటాని తన చావును సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.  అరవై సంవత్సరాల పోరాటం తర్వాత కాంగ్రెస్ మెడలు వంచి రాజకీయ సిద్దాంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
Image result for telangana schools
 తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది పథకాలకు శ్రీకారం చుట్టారు.  ఇప్పటికే మిషన్ భగీరధ, డబుల్ బెడ్ రూమ్ పథకం, స్వచ్ఛ హైదరాబాద్ లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  తెలంగాణలో అందరూ తెలుగు ఖచ్చితంగా నేర్చేకోవాలనే ఉద్దేశ్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా సంస్థలను కోరారు.
Image result for telangana schools
 అంతే కాదు ప్రతి స్కూల్ లో తెలుగు తప్పని సరిగా ఒక సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.  ఈ విషయం పై హీరో మంచు మనోజో స్పందిస్తూ..కేసీఆర్‌ను తెగ పొగిడేస్తున్నారు. తన ట్విట్టర్ లో కేసీఆర్‌పై కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. "మన మాతృభాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ ట్వీట్ మనోజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: