అప్పటి వరకు ఎంతో ఆనందంతో కేరింతలు, చప్పట్లు కొడుతున్న జనాలు ఒక్కసారే షాక్ కి గురయ్యారు.  ఇట‌లీలోని టెర్రాచినా ప్రాంతంలో జ‌రుగుతున్న ఎయిర్ షోలో జరుగుతుండటంతో..వంద‌ల మంది ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. విన్యాసాలను తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఇటాలియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఈ జెట్ విమానం అప్ప‌టి వ‌రకు వివిధ విన్యాసాలు ప్ర‌ద‌ర్శించి వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

పర్యాటకులు  ఎంతో ఉత్సాహంగా  విన్యాసాలను చూస్తుండగానే మిలిటరీ విభాగానికి చెందిన యూరో జెట్‌ఫైటర్‌ విమానం సముద్రంలో కూలిపోయింది.   `ఫ్రెచ్చె టెర్రాచినా` అనే విన్యాసం ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా అదుపు త‌ప్పి స‌ముద్రంలో ప‌డిపోయింది.యూరో జెట్‌ఫైటర్‌  విమానం సముద్రంలో కూలిపోతున్న దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.

వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ విమానం ఆచూకీని గుర్తించ‌డంలో కొద్దిగా ఆల‌స్యం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఫైలెట్‌ చనిపోవడంతో గాలింపు చర్యలు చేపట్టి డెడ్‌బాడీని వెలికి తీశారు. జెట్‌ఫైటర్‌ ఎలా కూలిందన్న దానిపై ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: