ఈ భూమిపై ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి..కొన్నింటిని మనం చూడగలుగుతున్నా ఎన్నో రకాల జీవులను మనం చూడలేము.  ముఖ్యంగా సముద్రగర్భంలో ఉన్న వింత వింత జీవరాశులను మనం చూసే అవకాశం చాలా అరుదు.  టెక్నాలజీ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో కొన్ని చానల్స్ ప్రసారం చేసే జంతు ప్రపంచంలో మనం ఎప్పుడూ చూడని చిత్ర విచిత్రమైన జంతువులను, జలచర జీవులను చూస్తుంటాం.  

ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఇంత వరకు చూడని వింత జంతువులను, పక్షులను, సముద్ర జీవులను చూసే అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా పసిఫిక్ మహా సముద్రగర్భంలో మత్య్సకారులకు ఓ అరుదైన చేప దొరికింది.  ఇది చూడటానికి అచ్చం మనిషి తల అకారంలో ఉంది..గ్రాఫిక్స్ లో చూపించినట్లు భయంకరమైన రూపాన్ని కలిగినట్లు..పెద్ద పెద్ద కళ్లు, ముక్కు, చిన్న నోరు చూడటానికి చాలా వింతగా ఉంది.  

ఇలాంటి చేపను తాము ఇదివరకు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు మత్స్యకారులు. ఈ చేపలో మరో ప్రత్యేకత ఉంది..కావాల్సినపుడు ఉబ్బిపోతుంది..కొద్ది సేపటికే చిన్నగా అవుతుంది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది


మరింత సమాచారం తెలుసుకోండి: