ప్రశాంత్ కిశోర్ వైసీపీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించడం పీకే టీం పని. ఇందులో ప్రశాంత్ కిశోర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల జగన్ లండన్ వెళ్లిన సమయంలో పీకే టీం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టినట్టు సమాచారం. మరి ఆ సర్వే ఏమంటోంది.

Image result for prashant kishor and jagan

          నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నైరాశ్యం ఆవహించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని అందరూ భావించారు. అయితే పీకే తాజాగా జరిపిన సర్వేలో వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదని తేలిందట. కార్యకర్తల్లో ఒకింత నిస్సత్తువ ఆవహించినా పార్టీపై ప్రేమాభిమానాలు అలాగే కొనసాగుతున్నాయని సర్వేలో వెల్లడైందని సమాచారం. వచ్చే ఎన్నికలనాటికి పార్టీ మళ్లీ పూర్తిస్థాయిలో పట్టాలెక్కి విజయం సాధిస్తుందనే నమ్మకం కార్యకర్తల్లో ఉందని సర్వే తేల్చిందట.

Image result for prashant kishor and jagan

          అయితే... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని పీకే టీం అంచనా వేసిందని తెలుస్తోంది. ఈ 40 నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి పెడితే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉండబోవని పీకే జగన్ కు చెప్పారట. ఆ నియోజకవర్గాల్లో సరైన నాయకులు లేకపోవడం ఓ కారణమైతే.. నాయకుల మధ్య విభేదాలు మరో కారణమని సర్వేలో తేలిందట.

Image result for prashant kishor and jagan

          నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ లెవల్లో జరిగిన ఈ సర్వేలో నేత ప్రస్థానం, వారి బ్యాక్ గ్రౌండ్ పైన కూడా వివరాలు సేకరించారు. ఇందులో 60-70 శాతానికి పైగా లీడర్లు తెలుగుదేశం పార్టీలో పనిచేసినట్టు వెల్లడించారట. దీన్నిబట్టి తెలుగుదేశం పొలిటికల్ పార్టీలా కాకుండా ఫ్యాక్టరీలా కనిపిస్తోందని పీకే కామెంట్ చేశారట. టీడీపీ నుంచి ఓ లీడర్ వెళ్లిపోయినా ఆ పార్టీ మరింతమంది లీడర్లను తయారు చేసుకుంటోందని.. పార్టీ పట్ల అలాంటి అంకితభావం అవసరమని సర్వే కంక్లూజన్ లో పీకే ప్రత్యేకంగా ప్రస్తావించారట..! అంతేకాదు.. చంద్రబాబు గురించి నితీశ్ కుమార్ గతంలో చాలా గొప్పగా చెప్పారని, ఇప్పుడు సర్వేలో ఆ విషయం కళ్లకు కనిపిస్తోందని తెలిపారట.. ఇదండీ ... పీకే టీం లేటెస్ సర్వే అప్ డేట్స్..!!


మరింత సమాచారం తెలుసుకోండి: