ప్రపంచంలో పాములు అంటే భయపడని వారు ఉండరు..ఇక విషయం చిమ్మించే పాములను చూస్తే.. ఆమడ దూరం పరుగెడతాం. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పాము కాటుకి గురై ఎంతో మంది చనిపోతున్నారు.  ఇక పాముల్లో చిన్న సైజు నుంచి భారీ సైజులు కూడా ఉంటాయి.  కొండ చిలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇవి కనీసం ఐదు అడుగుల నుంచి ఇరవై అడుగులకు పైగా ఉన్న కొండ చిలువలను డిస్కవరీ,  నేషనల్ జియోగ్రాఫిక్ చానల్స్ లో చూస్తుంటాం. 

తాజాగా ఇండోనేషియాలో వ్యక్తి సాహసానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే.   ఒక సెక్యూరిటీ గార్డు 23 అడుగుల కొండచిలువతో తలపడి ఇద్దరి ప్రాణాలు కాపాడి హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..ఇండోనేసియా అడవుల్లో భారీ సైజు ఉండే కొండచిలువలు సంచరిస్తూ ఉంటాయి. అక్కడి చిన్న చిన్న జంతువులతో పాటు ఒక్కోసారి మనుషులను కూడా అమాంతంగా మింగేస్తాయి. 
Image result for Python
అయితే  రాబర్ట్‌ నబబన్‌ (37) ఇంద్రగిరి హులు రీజియన్స్ ఆఫ్ రియావు ప్రావిన్స్‌ లో సెక్యూరిటీ విధులు పూర్తి చేసుకుని తన మోపెడ్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గడ గడా వణుకుతూ అతనికి కనిపించారు.  వారి దగ్గరికి వెళ్లి చూస్తే..పరిస్థిగి ఎంతో దారుణంగా ఉందని గ్రహించాడు రాబర్ట్.  అక్కడ వారు చూసి భయపడుతుంది..చిన్న పామును కాదు..దాదాపు  23 అడుగుల కొండచిలువ అది నోరు పెద్దగా చేసుకొని వారిపై దాడి చేయడానికి సిద్దంగా ఉంది.
Indonesia snake
కానీ, రాబర్ట్ ఏ మాత్రం భయపడకుండా..దానితో యుద్ధానికి దిగాడు. ముందు దానిని ఒడిసిపట్టేద్దామని భావించాడు. ఈ ప్రయత్నంలో అది అతని చేతిని తీవ్రంగా గాయపరిచింది. అయినా దాన్ని అంతు చూడాలనే సంకల్పంతో పోరాడి మొత్తానికి ఆ కొండచిలువను చంపేశాడు. అప్పటికే రాబర్ట్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.  ఆ కొండ చిలువను ఊర్లోకి తీసుకెళ్లి రెండు చెట్లకు కట్టారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: