వైసీపీలో నంద్యాల‌, కాకినాడ రిజ‌ల్ట్ త‌ర్వాత స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్ పెడ‌తారో ? ఏ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ను మార్చేస్తారో తెలియ‌డం లేదు. పీకే చెప్పిన‌ట్టు జ‌గ‌న్ ఆడేస్తున్నాడు. తాజాగా ఉత్త‌రాంధ్ర‌లోని కీల‌క జిల్లా అయిన విశాఖ జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చ‌డం ఆ పార్టీలో పెద్ద చిచ్చుకు కార‌ణ‌మైంది. ఇది కాక మ‌రో మూడు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను మార్చాల‌ని చూస్తున్నారు. దీంతో జిల్లా వైసీపీలో నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాల‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డ్డాయి. 

ys.jagan కోసం చిత్ర ఫలితం

పార్టీని ముందునుంచి న‌మ్ముకున్న త‌మ‌ను కాద‌ని కొత్త‌వారిని తీసుకొచ్చిపెడితే త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చేశారు. జ‌గ‌న్ భీమిలి, ఎల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను మార్చేశారు. ఇక ప్ర‌స్తుతం అర‌కులోయ‌, విశాఖ నార్త్ టికెట్ల‌ను కొత్త‌వారికి ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒక‌రికి విశాఖ నార్త్ టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే స‌ద‌రు మాజీ ఎమ్మెల్యే ఎల‌మంచిలి టిక్కెట్ అడుగుతుండ‌డంతో ఆ ప్ర‌తిపాద‌న ప్ర‌స్తుతానికి పెండింగ్‌లో ప‌డింది.


ఇదిలా ఉంటే ఎల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప్ర‌గడ నాగేశ్వ‌ర‌రావును త‌ప్పించి ఈ ప్లేస్‌లో బొడ్డేడ ప్ర‌సాద్‌ను నియ‌మించారు. ఇక మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న భీమిలిలో క‌ర్రి సీతారామ్ స్థానంలో విజ‌య‌నిర్మ‌లను నియ‌మించారు. దీంతో క‌ర్రి సీతారామ్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న బాట‌లోనే మ‌రికొంత మంది నేత‌లు ప‌య‌నించే అవకాశం ఉంది. 

ysrcp logo కోసం చిత్ర ఫలితం

ఇక ఏజెన్సీలోని అర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు పార్టీ మారిపోవ‌డంతో పాల్గుణను జ‌గ‌న్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. అయితే ఆయ‌న నియామ‌కాన్ని స్థానిక పార్టీ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు.  ఇక్క‌డ వైసీపీని ఓడిస్తామ‌ని వారు జ‌గ‌న్ వ‌ద్దే ప్ర‌తిన‌బూన‌డంతో జ‌గ‌న్ ఈ నియామ‌కాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇక జిల్లాలో కీల‌క‌మైన విశాఖ ఎంపీ సీటును కూడా నాన్‌లోకల్‌కు ఇస్తార‌న్న టాక్ రావ‌డంతో స్థానిక క్యాడ‌ర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. 


ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నేకునే వారు క‌నీసం రూ.10 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని జ‌గ‌న్ కండీష‌న్లు పెడుతున్నార‌న్న టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది. అలా అయితే ముందునుంచి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన త‌మ గ‌తి ఏం కావాల‌ని ?  పాత కాపులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా విశాఖ వైసీపీలో ముస‌లం మామూలుగా లేదు.

ys.jagan కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: