తమిళనాట సినిమా రాజకీయాలు మంచి రసకందాయం లో పడ్డాయి .. రజినీకాంత్ తన వైఖరి విషయం లో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే కమల్ హాసన్ అప్పుడే ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తున్నారు. త్వరలో రాజకీయ పార్టీ పెట్టాలని ఫిక్స్ ఐన కమల్ వచ్చే నెలల 7 న పార్టీ పెట్టడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అంటూ తమిళనాట న్యూస్ హాట్ గా షికారు చేస్తోంది. తమిళనాడు లో ప్రస్తుతం ఉన్న పార్టీలకి తన పార్టీ ప్రత్యామ్న్యాయం అవుతుంది అని కమల్ ఎప్పుడో ప్రకటించారు.


తన పార్టీ డీఎంకే కీ అన్నా డీఎంకే కీ వ్యతిరేకంగానే ఉంటుంది అని అవినీతి మీద పోరాటం కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు కమల్ ఎప్పుడో ప్రకటించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఆయన అధికారికంగా డేట్ కానీ పార్టీ పేరు కానీ దాని అజెండా గానీ చెప్పలేదు.


రీసెంట్ గా కమల్ అభిమాన సంఘాల జిల్లా కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ ఆవిర్భావం, జెండా-అజెండా, పార్టీ విధివిధానాల గురించి వారితో చర్చించారు. మరి కమల్ పార్టీ, విజయ్ కాంత్ పార్టీ లాగా చరిత్రలో కలిసిపోతుందా లేక ఎంజీఆర్ పార్టీ లాగ చరిత్ర సృష్టిన్స్తుందా అనేది వేచి చూడాలి. పార్టీ పేరు , గుర్తు , జండా లాంటివి ఆయన ఏడు న చెప్పబోతున్నారు , పైగా అదే రోజు ఆయన పుట్టిన రోజు కూడా. 


మరింత సమాచారం తెలుసుకోండి: