రెండు రోజుల క్రితం తన అభిమాని , టీడీపీ కార్యకర్త మీద నందమూరి బాలకృష్ణ చెయ్యి చేసుకున్న విషయం నేషనల్ మీడియా వరకూ వెళ్ళిన సంగతి తెలిసిందే. లోకల్ మీడియా సైలెంట్ గా ఉన్నా కూడా నేషనల్ ఛానల్ వారు బాలయ్య చేసిన పనిని హైలైట్  చేసి చూపించారు. ఫ్యాన్స్ మీద లేదా చుట్టుపక్కల ఉన్న పార్టీ వర్కర్ ల మీద బాలయ్య ఈ స్టైల్ లో చెయ్యి చేసుకోవడం అనేది కొత్త విషయం అసలే కాదు.

గత ఐదారేళ్ళు గా ముఖ్యంగా టీడీపీ నాయకత్వం లోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయిన  తరువాత ఆయన బయట ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన చాలా దురుసుగా ఉంటోంది అంటూ మీడియా సైతం చెబుతోంది.

తాజాగా అనంతపురం జిల్లాలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ ఓ అభిమాని, టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టినట్టు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది. పంచ్ డైలాగులు, ఫైట్స్ తో సినిమాల్లో తన అభిమానులను అలరించే బాలకృష్ణ, ఇలా తనపై అభిమానం చూపే వారిమీద సంయమనం కోల్పోయి చెయ్యి చేసుకోవడం పార్టీపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానిస్తున్న వారి సంఖ్య టీడీపీలో క్రమంగా పెరుగుతోంది.

దండ వెయ్యడానికి ప్రయత్నించిన వారినీ , సేల్ఫీ దిగడానికి వచ్చిన వారినీ , ఒక సామాన్యుడి గా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినవారి మీదా ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటి అంటూ టీడీపీ లోనే చర్చ నడుస్తోంది. తొందర లో చంద్రబాబు కి ఈ విషయం మీద తెలుగు తమ్ముళ్ళు కంప్లైంట్ కూడా చేసేలా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: