దేశంలో ఈ మద్య గల్లీ గల్లీకి ఓ దొంగ బాబా పుట్టుకొస్తున్నారు..ప్రజల మూఢ విశ్వాసాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు.  మరికొంత మంది బాబాలు పెద్దరికం ముసుగులో వేల కోట్లు సంపాదిస్తున్నారు.   బాబాల ముసుగులో కొంత మంది దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలు చూస్తుంటే..ఆశ్చర్యం వేస్తుంది.  సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్న దొంగ బాబాలు పేరుకు మాత్రం పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు.
Related image
ఇప్పటికే నిత్యానంద, ఆశారాం బాబా, డేరా బాబా గుర్మీత్, ఫలహారీ బాబా భాగోతాలు బయట పడటంతో వారిని అరెస్టు చేశారు. తాజాగా మరో   కీచకుడి ఉదంతం బట్టబయలైంది.   ఈ మద్య సీతాపూర్ బాబా అలియాస్ సియారామ్ బాబా ఓ దళిత యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో అరెస్టు అయ్యారు.  దేశంలో దొంగ సాములు భాగోతాలు రోజు బయటపడుతూనే ఉన్నాయి..ప్రజల్లో మాత్రం వారిపట్ల విశ్వాసం మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 

దైవమాత `రాధేమా`కు సంబంధించి కొన్ని వివాదాస్ప‌ద ఫొటోలు, వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. వీటిలో ఆమె పోలీసు అధికారి కుర్చీలో కూర్చుని ఉండ‌గా, ప‌క్క‌నే పోలీసు అధికారి చేతులు క‌ట్టుకుని నిల్చుని ఉన్న ఫొటో వివాదాస్ప‌ద చ‌ర్చ‌ల‌కు దారి తీస్తోంది.తనకు తానుగా దేవతనంటూ ప్రచారం చేసుకుంటున్న రాధేమాకు వివేక్ విహార్ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు.
Image result for godwoman radhe maa spotted police officers chair
అర్ధరాత్రి దాటిన తర్వాత రాధేమా వివేక్‌ విహార్‌ స్టేషన్‌కు వెళ్లింది. రాధేమా స్టేషన్‌లోకి అడుగు పెట్టగానే పోలీసులు వీఐపీ స్వాగతం పలికారు. స్టేషన్‌లో వచ్చిన తర్వాత ఎస్‌హెచ్‌ఓ తన కుర్చీలో రాధేమాను కూర్చోబెట్టడం ఆమె చున్నీని తీసుకొని మెడలో వేసుకోవడంతో వ్యవహారం కాస్తా వివాదాస్పదమవుతోంది. స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల విమర్శలు గుప్పించారు. 

`రాధేమా`కు అతిథి మ‌ర్యాద‌లు చేస్తున్న పోలీసులు అంటూ ఆ ఫొటోగ్రాఫ‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోలీసు స్టేష‌న్ హెడ్ సంజ‌య్ శ‌ర్మ మీద విచార‌ణ చేయాల‌ని ఢిల్లీ పోలీసు శాఖ ఆదేశించింది. మరో ట్విస్ట్ ఏంటంటే..ఆమె మీద పువ్వులు చ‌ల్లుతూ పోలీసులు డ్యాన్స్‌లు చేసిన వీడియోలను కూడా ఫొటోగ్రాఫ‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: