సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఆఖరిగంటలో భారీగా పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రికి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతిలో సాగిన ఈ ఓటింగ్ లో పెద్దఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మొత్తం 16 సంఘాలు బరిలో దిగాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం టీబీజీకెఎస్, జాతీయ సంఘాల కూటమి మధ్యే జరిగింది.

Image result for singareni elections

 సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 52వేల 534 మంది కార్మికులకు ఓటు హక్కు ఉంది. మొత్తం 11 ఏరియాల్లో ఓటింగ్ జరిగింది. 92 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పూర్తి కావడంతో ఆయా ఏరియాల్లోనే ఓట్లను లెక్కించనున్నారు. ఏరియాల వారీగా మొదట ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫలితాలన్నింటిని క్రోఢీకరించి ఫైనల్ రిజల్ట్ ను అనౌన్స్ చేయనున్నారు. తొలి ఫలితం ఇల్లందు నుంచి, ఫైనల్ ఫలితం కార్పొరేట్ ఏరియా నుంచి వెల్లడయ్యే అవకాశం ఉంది.

Image result for singareni elections

   సింగరేణి గుర్తింపు సంఘానికి ఇప్పటి వరకూ ఐదు సార్లు ఎన్నికలు జరగ్గా ఇప్పుడు జరిగింది ఆరో ఎన్నిక. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ మూడు సార్లు, ఐఎన్టీయూసీ ఓసారి, టీబీజీకేఎస్ మరోసారి ఎన్నికయ్యాయి. టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్, ఏఐటీయూసీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. అయితే టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామనే నమ్మకంతో ఉంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: