సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో తెరాస అనుబంధ తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం ఘన విజయం సాధించింది. మొత్తం 11 డివిజన్ లకి జరిగిన ఎన్నికల్లో తొమ్మిది చోట్ల తిరుగులేకుండా గెలిచింది తెరాస.ఐఎన్టీయుసీ - టీఎన్టీయూసీ తదితర సంఘాలతో ఏర్పడిన ఏఐటీయూసీ కూటమి భూపాలపల్లి - మందమర్రి ఏరియాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది.


కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ పార్టీల అనుబంధ సంఘాలు కలిసి పని చేసినా కూడా తెరాస దగ్గరకి కూడా రాలేకపోయాయి. అయితే ఈ గెలుపు మొత్తం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తన కూతురు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఖాతా లో వేయడం విశేషం.


రాష్ట్రం లో ఇది అతిపెద్ద కార్మిక సంఘ ఎన్నిక అవడం తో ప్రధాన పార్టీలు అన్నీ దీన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి - మల్లు భట్టివిక్రమార్క - రేవంత్ రెడ్డి - డాక్టర్ లక్ష్మణ్ - కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా - ప్రతిపక్షనేత జానారెడ్డి ఇలాంటి వారు అందరూ ఉన్నా కూడా కవిత సింగరేణి ఎన్నికల్లో చాలా ప్రభావం చూపించారు అంటున్నారు కెసిఆర్. 


టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా  ఉన్న ఆమె రాత్రి పగలూ అనే తేడా లేకుండా కార్మికుల సమస్యల కోసం కొత్త గూడెం నుంచి మందమర్రి లాంటి ప్రాంతాలకి వెంటనే చేరుకొని పరిస్థతి సమీక్షించడం లాంటివి చేసారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆరు జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో పర్యటించారట ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: