ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్దం సాగుతుంది.  ఈ మద్య నంద్యాల ఉప ఎన్నికల్లో అయితే నువ్వా..నేనా అన్నంతగా ప్రచార హోరు సాగించారు.  అసలు అక్కడ ఉప ఎన్నికలా..సార్వత్రిక ఎన్నికలా అన్నంత ఉత్కంఠంగా కొనసాగింది తంతు.  ప్రచారం పర్వంలో భాగంగా  ఎన్నికలకు వారం ముందు నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్కడ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రతిపక్ష తీరును ఎండగడుతూ..ప్రచారం చేశారు. 
Image result for tdp
ఏది ఏమైనా నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగు దేశం అత్యధిక మెజార్టీతో గెలిచింది.  ఆ తర్వాత కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో సైతం టీడీపీ జెండా ఎగుర వేసింది.  దీంతో వైసీపీలో కొంత మంది నేతలు తమ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టీడీపీ లోకి జంప్ అయ్యే పనిలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. 
Related image
దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ వార్తలు అవాస్తవమని వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని పాత్రికేయులతో చెప్పారు.  అంతే కాదు తనపై కొంత మంది  ఓ పథకం ప్రకారం కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా రేణుక ఆరోపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: