టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబుకు బాగా గురి కుదిరింది. వారి అద్భుతమైన ఆలోచనా తీరు, సినిమాల్లో వారు వాడుతున్న కళా నైపుణ్యం చంద్రబాబు బాగా న‌చ్చేసిన‌ట్టు ఉంది. అందుకే ప‌దే ప‌దే టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ను చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణంలో ఇన్వాల్ చేస్తున్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన వెనక్కి తగ్గకుండా తనదైన స్టైల్లో ముందుకు వెళుతున్నాడు. మొన్న రాజధాని డిజైన్ల బాధ్య‌త‌ రాజమౌళికి అప్పగించగా .. నేడు అమ‌రావ‌తికి ద‌గ్గ‌ర్లో కృష్ణా-గోదావ‌రి న‌దుల ప‌విత్ర సంగ‌మ స్థ‌లిలో ఒక ఆల‌య శిఖ‌రాన్నినిర్మించే భాద్యతను దర్శకుడు బోయపాటి శ్రీనుకి అప్పగించాడు. 

ss.rajmouli కోసం చిత్ర ఫలితం

ద‌శావ‌తారాల కాన్సెప్ట్ తో  ఈ సంగ‌మ స్థ‌లిలో ఒక ఆల‌య శిఖ‌రాన్ని నిర్మించేందుకు బాబు డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన థీమ్‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని.. డిజైన్లు సిద్ధం చేయాల‌ని ద‌ర్శ‌కులు బోయ‌పాటిని కోరారు.  గోదావ‌రి.. కృష్ణా న‌దుల‌ను అనుసంధానించి ఆఖండ గోదావ‌రి నుంచి ప‌విత్ర సంగ‌మం మీదుగా రాష్ట్రంలో జ‌ల‌సిరికి హార‌తి ప‌డుతున్నారు. ఈ ప‌విత్ర స్థ‌లాన్ని మ‌రింద ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాల‌ని బాబు ప్లాన్ చేస్తున్నారు. అమ‌రావ‌తిలో టీటీడీ త‌ర‌హాలో ఆల‌యాన్ని నిర్మించాలనే ఆలోచన కూడా బాబుకి ఉంది.


ఇదిలా ఉంటే తిరుమ‌లేశుని మూడు నామాలు.. దానిపై ఆల‌య గోప‌రం ఉండేలా.. వాటి కింద నుంచి న‌దీ ప్ర‌వాహం వెళ్లేలా బోయపాటి డిజైన్లను చంద్రబాబుకి చూపించి ఒకే చేయించుకున్నాడు. తాజాగా రాజ‌ధాని ప‌నుల పురోగ‌తిపై మంత్రి నారాయ‌ణ‌.. సీఆర్డీఏ అధికారులు.. పుర‌పాల‌క శాఖ అధికారుల‌తో క‌లిసి భేటీ నిర్వ‌హించారు. దీనికి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి సైతం హాజ‌ర‌య్యారు. తాను త‌యారు చేయించిన గోపురం ఆకృతికి సంబంధించిన త్రీడీ చిత్రాల్ని ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. 

boyapati srinu కోసం చిత్ర ఫలితం

ఈ థీమ్ ప‌ట్ల చంద్ర‌బాబు సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆగ‌మ‌శాస్త్ర నిపుణులు.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పండితుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి.. బోయ‌పాటి త‌యారు చేసిన డిజైన్‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. ఆ త‌ర్వాత మాత్ర‌మే డిజైన్ ను బ‌య‌ట‌పెట్టాల‌ని కోరారు. ఏది ఏమైనా రాజధానిలో అద్భుత కళా ఖండాలు సృష్టించే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గించ‌డం విశేషం. ఈ కీల‌క ప్రాజెక్టులో చంద్ర‌బాబు డైరెక్ట‌ర్ల డిజైన్ల‌కే మొగ్గు చూప‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: