సాధారణంగా పండుగలు, పర్వదినాల్లో ఆఫర్లు ప్రకటించడం వ్యాపార వర్గాలకు సర్వసాధారణమే.  ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనగానే జనాలు ఎగబడి మరీ తీసుకుంటారు. ఇక దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు మంచి ఆఫర్లు ఉంటాయని అప్పుడే వస్తువులు కొంటే తక్కువ ధరలో దొరుకుతాయని అభిప్రాయం కొంత మంది వినియెగదారులకు ఉంటుంది.  ఇక దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యాపారులు రకరకాల రాయితీలు, బహుమతులు ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే. 
Image result for dealer offers free goat on every bike
తాజాగా ఓ మోటర్స్‌ డీలర్ చేసిన జిమ్మిక్కు చూస్తే నిజంగా షాక్ అవుతారు..తమిళనాడులోని ఇలియంగుడీ అనే ఓ చిన్న పట్టణంలో గాయత్రీ మోటర్స్‌ డీలర్ వెరైటీగా ‘ మా వద్ద బైక్ కొంటే మేక ఫ్రీగా ఇస్తాం’ అని ప్రకటన వేశారు.  అయితే దీనికి రెస్పాన్స్ వస్తుందో లేదో అన్న చిన్న ప్రయత్నం అనుకున్నాడు..కానీ ఇది నిజంగా మనోడికి దిమ్మతిరిగేలా చేసింది. ఎంతగా అంటే.. ఇక ఫ్రీగా ఇవ్వడానికి మేకలు కూడా సరిపోనంత. రోజూ బైకులు కొనేవాళ్లు 'మేక ఇస్తానే కొంటాం.. లేకపోతే వేరే చోటకు వెళ్తాం' అంటూ.. డీలర్ ను ఇబ్బంది కూడా పెట్టారు. 
Image result for dealer offers free goat on every bike
దీంతో మనోడు కొత్త చిక్కుల్లో పడ్డాడు..ఈ ఆఫర్ కి డిమాండ్ బాగా పెరిగింది..కానీ మేకలు మాత్రం అందుబాటులో లేవు..దీంతో తన ప్రకటనను రద్దు చేసేశాడు.  వాస్తవానికి ఆ ఆఫర్ ఆపడానికి మరో కారణం ఉందట..మేకలు బాగా అమ్మకాలు జరగడంతో ఒక్కసారే వాటికి కూడా రేటు పెరిగిపోయింద..గతంలో తాను తీసుకున్న మేకలకు ఉన్న ఫలంగా రూ.3 వేలకు పెరగడంతో.. లాభం లేదని ప్రకటన రద్దు చేసుకున్నాడట.  


మరింత సమాచారం తెలుసుకోండి: