ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చెయ్యని ఏపీ మునిసిపల్ మినిస్టర్ నారాయణ ఎమ్మెల్సీ అయ్యి ఆ సైడ్ నుంచి మంత్రి అయ్యారు. మొదటి నుంచీ ఆయన టీడీపీ కి చాలా క్లోజ్ మనిషే అయినా కూడా ప్రత్యేక్ష ఎన్నికల్లో మాత్రం ఆయన ఎప్పుడూ నిలవలేదు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా ఆయన ని ప్రత్యక్ష రాజకీయాలలో నిలబెట్టాలి అనేది చంద్రబాబు అతిపెద్ద టార్గెట్ గా చెబుతున్నారు. దీనికి ఆయన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కూడా.

నెల్లూరు ప్రాంతం లో నిలబడ్డం కోసం సిద్దం అవుతున్న ఆయన నెల్లూరు మీద ఎప్పుడూ లేనంత ప్రేమ చూపిస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం లో భాగంగా ఆయన ఆ ప్రాంతం లో బాగానే తిరుగుతున్నారు. నాయకుడి పాత్రలోకి సైతం ప్రవేశించి దుకాణాల్లో టీ లు పెట్టడం దగ్గర నుంచి జనాల బట్టలు ఇస్త్రీ చేసేవరకూ చాలా హడావిడి చేసారు.

రీసెంట్ గా మాంసం కొట్టు లో మాంసం కొడుతూ అన్ని వర్గాల ప్రజల్నీ తనతో పాటు తీసుకుని , కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి. మ‌రో ఏడాదిలోగా ఒక పూర్తి స్థాయి నాయ‌కుడిగా త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. నారాయణ కి ఇది అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి.

అధికార పార్టీ లో కీ రోల్ పోషించడం వేరు ప్రజా క్షేత్రం లో ప్రజల మనసులు గెలుచుకోవడం వేరు రెండూ వేరు వేరు వ్యవహారాలు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిని అని ప్ర‌క‌టించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ఫీట్లు చేయ‌డం అనేది… ఎంత‌వ‌ర‌కూ క‌లిసొస్తాయో మ‌రి! ఇక‌, నెల్లూరు విష‌యానికొస్తే.. అక్క‌డ టీడీపీలో ఇప్ప‌టికే కొన్ని వ‌ర్గాలున్నాయి. సిటీలో కాస్త మంచి పేరున్న ఆనం సోద‌రుల‌కు పార్టీలో పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు.దాన్ని నారాయణ క్యాష్ చేసుకోగలరా అనేది ఛాలెంజ్ .


మరింత సమాచారం తెలుసుకోండి: