సింగరేణి ఎన్నికల లో తమ వర్గం గెలుపుకి సంబంధించి కెసిఆర్ పెట్టిన మీడియా సమావేశం నుంచీ లోలోపల తెరాస లో , ఆ నాయకులతో కెసిఆర్ మాట్లాడుతున్న విషయాల వరకూ చూస్తే కెసిఆర్ కి కోదండరాం మీద పీకలలోతు వరకూ కోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ విజయం ఇచ్చిన నైతిక రాజకీయ ఊతం కెసిఆర్ కి మామూలుగా లేనే లేదు. తెలంగాణా విషయం లో కాంగ్రెస్ పాత్రం జీరో అని కెసిఆర్ తేల్చి అవతల పడెయ్యడానికి ఈ ఎన్నికలు బాగా ఉపయోగ పడ్డాయి. సింగరేణి ఎన్నికలు పూర్తి అయ్యేదాకా ఆగి వాటిని రిఫరెండం గా తీసుకుని కాంగ్రెస్ తో పాటు కోదండరాం ని ఇంటా బయటా ఉతికి ఆరేసారు కెసిఆర్.

మీడియా లో దుమ్ము దులిపిన కెసిఆర్ పార్టీ వారితో కూడా కోదండరాం ఏందీ అతని లొల్లి ఏందీ అన్నట్టు తీసి పరేసారట. నేను తయారు చేసిన లక్షల మంది కార్యకర్తల్లో ఆయనొకరు. ఎక్కువగా వూహించుకుంటున్నాడు.

బండి చక్రం కింద నడిచే కుక్క తానే నడిపిస్తున్నాననుకుంటుందట. జెఎసి పేరు పెట్టిందే నేను, ఎవరు చైర్మన్‌గా వున్నా నడుస్తుంది. ఈయన కంట్రిబ్యూషన్‌ ఏమీ లేదు. తొక్క… టిబిజిఎస్‌కె గెలిస్తే సింగరేణి నాశనం అవుతుందంటాడా? ఎలా నాశనం అవుతుందో ఆయన చెప్పాలి.

ఎప్పుడైనా సర్పంచిగానైనా గెలిచాడా? ఆయన ఏమైనా జాతీయ నాయకుడా పొనే ఎమైన ముఖ్యమంత్రా ? ఈయన పిలుపు విని కనీసం ఐదొందల మంది ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చాడా ? ఎప్పుడూ తెరాస వ్యతిరేకి గా ఉన్న కోదండరాం విషం కక్కడం లో బిజీ గా ఉంటాడు. అంటూ కెసిఆర్ కోదండరాం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసారు. చివరకి కోదండరాం ని కుక్కతో పోల్చే లాగా కెసిఆర్ మాట్లాడడం చూసి తెరాస జనాలే ఆశ్చర్యపోయారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: