మజ్లిస్ పార్టీ నేతలకు, ఆంధ్ర ప్రదేశ కు సంబంధించినంతవరకు కాంగ్రెస్ నిర్ణయాలను ప్రభావితం చేయగలవాడు అయిన అజాద్ కు సన్నిహిత సంబంధాలు వున్నాయని అంటారు. మరి అలాంటపుడు వారు తెలంగాణాపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయలేదా? కానీ తెలంగాణాపై ఒక స్థిర నిర్ణయం అంటూ మజ్లిస్ పార్టీకి లేకపోవడమే ఇప్పుడు వారిని చేష్టలుడిగేలా చేసిందని తెలుస్తోంది.

ఒకసారి తెలంగాణ ఏర్పాటుకు ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన చరిత్ర మజ్లిస్ కు వుంది. అలాంటిది ఇప్పుడు సమైక్యమే మా విధానం, దానికే కట్టుబడి ఉంటాం అంటూ ఆయన తీరు మార్చుకోవడంలో అర్థం ఏమిటి. మొన్నటిదాకా కాంగ్రెస్ తో అంటకాగి, వైకాప వైపు వెళ్లే ప్రయత్నం చేసి, ఇప్పుడు చంద్రబాబును పొగడడం వెనుక విషయం ఏమిటి?నిజానికి రాయల తెలంగాణ పేరుతో సీమలోని రెండు జిల్లాలను కలిపి ఇస్థే యూపిఏ కు లాభమని లెక్కలతో సహా మజ్లిస్ పార్టీ నేతలే వివిరించారని అందుకే ఇప్పుడు కాంగ్రేస్ ఆదిశగా అడుగులు వేసింది అన్న వదంతులయితే పుట్టాయి.

కానీ రాయల తెలంగాణాకు బిజెపి ససేమిరా అని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటిస్తే, 10జిల్లాల తెలంగాణా ఇవ్వడమే మిగిలింది. ఇలా చేస్తే బిజెపి బలపడుతుంది అన్నది మజ్లిస్ భయం. అందుకే మళ్లీ సమైక్య రాగం అందుకుంది.
నిజానికి కారణం మజ్లిస్ పార్టీ బలంగా ఉన్నది ఒక్క హైదరాబాద్ లోనే,

అది పాతనగరంలోనే, తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా మజ్లిస్ కు పెద్దగా ఒరిగేదేమి లేదు కానీ తెలంగాణా రాష్ట్రంలో కీలక ప్రతిపక్షంగా వుండే అవకాశం మజ్లిస్ కు వుంది. సంకీర్ణం వస్తే, తెలంగాణా ప్రభుత్వంలో పాలు పంచుకోవచ్చు కూడా . అది తెలిసి కూడా ఎందుకు వద్దంటోంది? అంటే తెలుగుదేశం, వైకాపా సమైక్య పార్టీలు కాబట్టి, భవిష్యత్ లో వారితో పొత్తు కోసం ఇలా మాట్లాడుతోందా?


 

మరింత సమాచారం తెలుసుకోండి: