పాపం..కెసిఆర్ ను చూస్తే జాలేస్తోంది. ఎందరో సాధించలేనిది ఆయన సాధించాడు. ఇన్నాళ్లుగా తెలంగాణా ఉద్యమాన్ని సజీవంగా వుంచాడు. ఆ ఉద్యమ ఫలితంగానే కాంగ్రెస్ దిగి వచ్చిందన్నది  వాస్తవం. కానీ ఆ ఇన్నాళ్ల  పోరాటాన్ని కాంగ్రస్ హైజాక్ చేసుకుపోతోంది. ... ఈ పరిస్థితిని కెసిఆర్ జీర్ణించుకోలేపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా.

తన రాజకీయంతో ఇన్నాళ్లూ కాంగ్రెస్ కు చెమటలు పట్టించిన ఆయన, ఇప్పుడు ఏం చేయాలో తెలియక చతికిల పడ్డారు. కాంగ్రేస్ తో తెగతెంపులు చేసుకుని
ఆపార్టీని అనరాని మాటలు అన్న కె. కేశవరావు కూడా హఠాత్తుగా మాయమయ్యారుకేసిఆర్ ఎంత ప్రయత్నించినా దొరకడంలేదుఇలాంటి సమయంలో కాంగ్రేస్ తో రాయబారం నడుపుతాడనే కేసిఆర్ కేకే ను పార్టీలోకి తీసుకున్నారు. పైగా ఆయనకు పార్టీలో అప్పచెప్పిన బాద్యతలు కూడా కేంద్రవ్యవహారాలు చూసుకునేందుకే.

అయినా కేకే ఇప్పుడు కేసిఆర్ ను పట్టించుకోవడంలేదుఅంతే కాదు ఇన్నాళ్లు తనవెంట ఉన్న జేఏసి,ప్రజాసంఘాలువిధ్యార్థిసంఘాలు ఇలా అన్ని కాంగ్రేస్ బాటనే పట్టాయి. మరోవైపు పార్టీలో కూడా పలువురు ఉద్యమకారులను పార్టీనుంచి వెల్లగొట్టారుపైసలుంటేనే పార్టీలో ఉండండి అంటూ ఎందరో సీనియర్లను అవమానించారు. రఘునందన్ రావు వంటి పార్టీ పుట్టుక నుంచి ఉన్నవారిని అవమానపరచి బయటకు పంపారు. కోదండరామ్ తప్పక కెసిఆర్ తో వున్నారు. కానీ ఆయనా సమయం కోసం చూస్తున్నారు.

ఇక ఇలాంటిసమయంలో తెలంగాణా ప్రకటిస్తే, కెసిఆర్ ను పూర్తిగా మరిచిపోతారేమో.అయినా గుర్తుచేయడానికి ఆయన పత్రిక, చానెల్ వున్నాయిగా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: