కొరియాపై యుద్ధమేఘాలు తొలగడం లేదు. ఉత్తరకొరియాను బెదిరించడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కొరియా ద్వీపకల్పంపై అమెరికా సూపర్ సోనిక్ బాంబర్లు చక్కర్లు కొడుతున్నాయి. జపాన్, దక్షిణకొరియాలతో కలసి అమెరికా సైనిక విన్యాసాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించి ఉత్తరకొరియాను బెదరగొట్టాలని చూస్తోంది.

Image result for koriya

ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు కొరియా తీరంలో కాచుకుని ఉన్నాయి. సబ్ మెరైన్లు నీటి అడుగున విధ్వంసానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సీల్ దళం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. ఉత్తరకొరియా మరో అడుగు వేస్తే తాము యుద్ధం ఆరంభించొచ్చని అమెరికా భావిస్తోంది. అయితే ఉత్తరకొరియా మాత్రం తాను ఏం చేయాలో అదే చేస్తోంది. సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతోంది.

Image result for koriya

యుద్ధానికి ఇప్పటికే పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికాను తాకేలా బాలిస్టిక్ మిస్సైళ్లను సిద్ధంగా ఉంచినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఏ మాత్రం తొందరపడ్డా పెను విధ్వంసం సృష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందుకే తమ చుట్టూ అమెరికా సైన్యం మోహరించిన కిమ్ అంత నిబ్బరంగా ఉన్నారు. త్వరలో కిమ్ మరోసారి అణుపరీక్షలు జరపొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే మాత్రం యుద్ధం అధికారికంగా ఆరంభమైనట్లే...

మరింత సమాచారం తెలుసుకోండి: