రాజ‌కీయాల్లో కీల‌కంగా ప‌నిచేసే వ్య‌క్త‌లకు గుర్తింపు లేక‌పోతే, అధినేత‌లు వారిని గుర్తించ‌క‌పోతే?  చివ‌రికి వారు ఎంత సీనియ‌ర్ల‌యినా పార్టీలు మార‌డ‌మో, కండువాలు మార్చ‌డ‌మో చేసేస్తారు. ఫ‌లితంగా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీ ప‌రువు బ‌జారే! ఇప్పుడు ఇదే సూత్రం ఏపీ అధికా ర పార్టీ టీడీపీలోనూ ఎదురు కానుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఓ సీనియ‌ర్‌, సిన్సియ‌ర్ నేత‌, ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నేత త‌న‌కు తీవ్ర ప‌రాభ‌వం జ‌రుగుతోంద‌ని భావిస్తూ.. బాబు బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ ప‌రిణామంతో టీడీపీ నేత‌లు, శ్రేణులు కుపుకున‌కు గుర‌య్యారు. ఆయ‌న అవ‌స‌రం ఏమిటో? ఆయ‌న‌ను ఎలా గౌర‌వించాలో చూడాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు విన్న‌విస్తున్నారు. 

mla pativada narayanaswami naidu కోసం చిత్ర ఫలితం

విష‌యంలోకి వెళ్తే.. టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నేత‌ల్లో ఒక‌రు పతివాడ నారాయణస్వామి నాయుడు.  విజయనగరం జిల్లాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుతోపాటు పార్టీకి వైభ‌వం తెచ్చిన నేత‌ల్లో ఈయ‌న ముందు వ‌రుస‌లో ఉంటారు.  అన్న‌గారి హ‌యాంలో టీడీపీ ఆవిర్భావ సమయంలో ఆయన పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక దఫా మంత్రి పదవిని చేపట్టారు. అయితే  మ‌రోసారి మంత్రి ప‌ద‌విలోకి రావాల‌ని ఆయ‌న ఆశించారు. త‌న మ‌న‌సులో మాట చెప్పేందుకు  చంద్రబాబు చుట్టూ ప్రదిక్షిణలు చేశారు. అయినా గత విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.


దీంతో ప‌తివాడ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న బాబు.. ప‌తివాడ‌ను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిస్తానని చెప్పారు. అయితే, దీనిని సీనియ‌ర్ ఎమ్మెల్యే సున్నితంగా తిర‌స్క‌రించారు. దీంతో ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. అయితే ఈ పదవి కూడా ఆయనకు ఇష్టం లేదు. గతంలో ఈపదవిని పతివాడ చేశారు. దీంతో అయిష్టంగానే ఆయన పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో సీనియర్ అయిన తనకు ముఖ్యమైన పదవి ఇవ్వక పోవడంపై ప‌తివాడ స‌హా ఆయ‌న కుటుంబం, అభిమానులు కూడా తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. 

mla pativada narayanaswami naidu కోసం చిత్ర ఫలితం

తన పని తాను చేసుకుపోతున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో నెలిమర్ల నియోజకవర్గంలోని పతివాడ అనుచరులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. తమకు ఇవ్వని గౌరవాన్ని తాము పార్టీకి ఎలా ఇస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఎంతకాలం సేవచేసినా ఇంతేనా? వేరే పార్టీలోకి వెళదాం.. అని పతివాడకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారట. కాని పతివాడ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. పార్టీపై అసంతృప్తితో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తన ముఖ్య అనుచరులతో చెప్పారట. మ‌రి ఇప్ప‌టికైనా బాబు స్పందించి ప‌తివాడ‌కు న్యాయం చేస్తారో లేదో చూడాలి..! 


మరింత సమాచారం తెలుసుకోండి: