Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Jan 20, 2018 | Last Updated 2:54 am IST

Menu &Sections

Search

ప్రపంచ దేశాల వెన్నులో చలిపుట్టిస్తున్న చైనా అధ్యక్షుని వ్యాఖ్యలు

ప్రపంచ దేశాల వెన్నులో చలిపుట్టిస్తున్న చైనా అధ్యక్షుని వ్యాఖ్యలు
ప్రపంచ దేశాల వెన్నులో చలిపుట్టిస్తున్న చైనా అధ్యక్షుని వ్యాఖ్యలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రపంచానికి చైనా కొరకరాని కొయ్యగా మారిపోతుంది. అసలే అందరూ రానున్న శతాబ్ధం గురించి మాట్లాడే కాలంలో చైనా రానున్న సహస్రాబ్ధాన్ని ప్రస్థావించటం దాని సహజ లక్షణం. అయితే మావో తరవాత చైనా లోను సైన్యంలోను ప్రభుత్వం లోను  జి జిన్ పింగ్ మరింత శక్తిమంతుడుగా మారిన తరుణంలో ఆయన మాటలకు ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన గుర్తింపు వస్తుంది.

china-president-xi-xinping-peoples-army-of-china-న

అలాగే విభిన్న దేశాలు వివిధ వర్గాల నుండి ప్రతి స్పందన అదేస్థాయిలో రావటం అతి సహజ పరిణామం.   చైనా పీపుల్స్ ఆర్మీని 2050 నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా రూపొందిస్తామని దేశాధినేత జిన్ పింగ్ ప్రకటన పట్ల పొరుగు దేశాలు ఒక ప్రక్క ఆందోళన వ్యక్తం చేస్తుంటే, దీని వల్ల ఎలాంటి ముప్పు రాదని మరోపక్క విశ్లేషకులు పేర్కొంటున్నారు.


యుద్ధ విమానాలు, నౌకలు, అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లు, నిర్మాణాల కోసం గత ముప్పై ఏళ్లుగా చైనా అధిక మొత్తాన్ని వెచ్చిస్తోంది.  అయితే ఇది అమెరికా రక్షణ రంగ బడ్జెట్‌తో పోల్చుకుంటే మూడు రెట్లు తక్కువ. గత నెలలో నిర్వహించిన కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో 2300 మంది ప్రతినిధులు సాక్షిగా జిన్ పింగ్ చేసిన రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు.

china-president-xi-xinping-peoples-army-of-china-న 

వాటిలో దేశ రక్షణకు చెందిన విషయాలపై మాట్లాడుతూ 21 వ శతాబ్దం మధ్యనాటికి సైన్యాన్ని ప్రపంచం లోని ఇతర దేశాల కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో చైనా ఇరుగు పొరుగు దేశాలైన భారత్, జపాన్, వియత్నాం లాంటి దేశలే కాదు రష్యా, అమెరికా, యూరోప్ లాంటి దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.

అయితే ప్రపంచ పోకడలను సహస్రాబ్ధాల కాలం నుండి స్టడీ చేసి విశ్లేషంచే వ్యవస్థలు విద్యార్దులు, పరిశీలకులు, నిపుణులు వేరేలాగా చూస్తున్నారు. దీనిపై సింగపూర్ ‘నయాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ’ కి చెందిన జేమ్స్ చార్ మాట్లాడుతూ, జిన్ పింగ్ వ్యాఖ్యలు జాతీయవాదులను ఉద్దేశించి చేసినవి, అలాగే ఇతర దేశాల కంటే ఆర్థికంగా, సైనికపరంగా బలంగా ఉండాలనే చైనా కోరికను బయట పెట్టాయని అన్నారు. అలాగే ప్రతిదేశమూ ప్రపంచములో అందరికంటే బాగుండాలని గొప్పగా ఉండా లని అనుకోవటం సహజమే కదా! అని అంటున్నారు. 


china-president-xi-xinping-peoples-army-of-china-న

19వ శతాబ్దం మధ్యకాలంలోనే చైనాలో నిరంకుశ పాలన మొదలైందని, కొన్ని విషయాల్లో ప్రధాన మినహాయింపుల ను ఇవ్వడానికి వాటిని తరచూ ప్రజలపై బలవంతంగా రుద్దుతుందోని వ్యాఖ్యానించారు. ఇతర దేశాలను బెదిరించాలని కాదు,  తమను తాము రక్షించుకోవడానే సైన్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయ త్నించడంలో తప్పు లేదని ‘షాంఘై యూనివర్సిటీ’ కి చెందిన పొలిటికల్ సైన్స్ అండ్ లా విభాగం ఆచార్యుడు నీ లెక్సియాంగ్ అన్నారు.పోరాటానికి దిగిన ప్రతిసారీ విజయం సాధించడమే లక్ష్యంగా తమ మిలటరీని మరింత శక్తివంతం చేస్తా మని జిన్ పింగ్ వ్యాఖ్యలతో పొరుగు దేశాలు ఆందోళన చెందు తున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో సమస్య లు మరింత ఎక్కువవుతాయని భావిస్తున్నాయి. ఇటీవల భారత్‌తో డోక్లామ్, దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేసియాలు, సెన్కాకు దీవుల విషయంలో జపాన్‌తోనూ చైనా వైఖరి అనేక వివాదాలకు దారితీసింది.

 china-president-xi-xinping-peoples-army-of-china-న

అయితే చైనా అధ్యక్షుని మాటలు అనేక దేశాలను ప్రభావితం చేస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదని కాకపోతే మరో సారి సైనిక ఆయుధ సంపత్తిపై అన్నీదేశాలు బేరీజు వేసుకొని తామూ పోటీపడే అవకాసం మాత్రం పెరిగిపోవటం తప్పనిసరిగా జరుగుతుందని అదీ సహజమేనని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు.

china-president-xi-xinping-peoples-army-of-china-న

china-president-xi-xinping-peoples-army-of-china-న
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author