విశ్వ నటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు ఇవాళ. త్వరలో రాజకీయాలలోకి రాబోతున్న ఆయన ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా విశేషమైన న్యూస్ ని జనాలకి అందిస్తారు ఏమో అనే ఉద్దేశ్యం లో ఉన్నారు అతని ఫాన్స్. తమిళ - తెలుగు ప్రజలతో పాటు నేషనల్ మీడియా సైతం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ పార్టీ పేరు , ఇతర విషయాల ప్రకటన చేస్తారు అనే అనుకుంటున్నారు. ఐతే ఇప్పటి వరకూ అలాంటి ఇంఫోర్మేషన్ ఇవ్వలేదు కమల్ హాసన్.

పైగా ఎప్పుడూ చేసుకునే పుట్టిన రోజు ని కూడా జరుపవద్దు అంటూ ఫాన్స్ కి పెద్ద బాంబ్ వేసాడు కమల్. రెండు మూడు వారాల నుంచీ తన పుట్టిన రోజు చేసుకోవద్దు అంటూ ఫాన్స్ కి గట్టిగా చెప్పడం మొదలు పెట్టాడు .. దీని మీద వారు ఒక్కసారిగా అసంతృప్తి లోకి వెళ్ళిపోయారు.

ఎన్నో సంవత్సరాల నుంచీ తమ తలైవా పుట్టినరోజు కి పండగ చేసుకుంటున్న వారు ఇప్పటికిప్పుడు ఆపమంటే కాస్త ఇబ్బంది పడ్డారు  తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాలన్న ఆలోచనపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారందరికీ తన విన్నపం ఒకటేనని చెప్పారు.

కేవలం పండగ వాతావరణం, వేడుకల కోసమే అయితే, ఒక రోజు ఆలస్యంగానైనే వాటిని జరుపుకోవచ్చని, అయితే, అనుకుంటున్న మార్పు రావాలంటే మాత్రం పద్ధితి ఇది కాదని, ముందుగా మనం మారి చూపాలని హితవు పలికారు.  కాగా, గత 40 సంవత్సరాల్లో 200కు పైగా సినిమాల్లో నటించి, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్న ఆయన, యువరక్తానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: