పెద్ద నోట్లు రద్దు చేసి సరిగ్గా సంవత్సరం అవ్వస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కి ఈ సందర్భంగా ప్రతిపక్షాలు అన్నే పిలుపుని ఇచ్చాయి. ఈ ప్రతిపక్షాల లిస్టు లో తమిళనాట ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే కూడా ఉంది. తాజాగా ప్రధాన మంత్రి మోడీ కరుణానిధి ని కలిసి అనేక విషయాలు చర్చించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమం లో వారిద్దరి మధ్యనా ఎలాంటి సంఘటనలు, భవిష్యత్తు ప్రణాలికల గురించిన్ డిస్కషన్ నడిచిందో తెలీదు కానీ డీఎంకే తాజాగా చేసిన ప్రకటన షాకింగ్ గా అనిపిస్తోంది.

తాము రేప‌టి నిరసన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. వ‌ర‌ద‌ ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఇందులో ఏ రాజ‌కీయ ఉద్దేశం లేద‌ని పేర్కొంది.మ‌రోవైపు రేపు బీజేపీ అవినీతి వ్య‌తిరేక దినోత్స‌వం నిర్వ‌హించ‌నుంది. 

డీఎంకే ని ఒక్క విజిట్ తో మోడీ దారిలోకి తెచ్చుకున్నారు అనీ తమిళనాట రానున్న ఎన్నికల్లో డీఎంకే ఖచ్చితంగా బీజేపీ తో దోస్తీ కడుతుంది అనీ అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. సౌత్ లో పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీ కి తమిళనాడు అనేది మెయిన్ టార్గెట్ గా ఉంటూ వచ్చింది . ఈ లెక్కన కరుణానిధి పార్టీ తో కలిసి వచ్చే ఎన్నికల్లో జండా ఎగరేయాలి అనేది బీజేపీ ప్లాన్ కావచ్చు .


మరింత సమాచారం తెలుసుకోండి: