Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Feb 21, 2018 | Last Updated 5:08 pm IST

Menu &Sections

Search

దేశానికి కలిగిన ప్రయోజనాలను గుర్తించకపోతే ఎలా?: ఆర్ధికశాఖా మంత్రి జైట్లీ

దేశానికి కలిగిన ప్రయోజనాలను గుర్తించకపోతే ఎలా?: ఆర్ధికశాఖా మంత్రి జైట్లీ
దేశానికి కలిగిన ప్రయోజనాలను గుర్తించకపోతే ఎలా?: ఆర్ధికశాఖా మంత్రి జైట్లీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

arun-jaitly-finance-minister-demonetization

భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే 2016 నవంబర్‌ 8వ తేదీ ‘మేలిమలుపు’ అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభివర్ణించారు. నల్ల ధనం బెడద నుంచి దేశానికి విముక్తి కలిగిచేందుకు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకున్న రోజదని అన్నారు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రచించిన ప్రణాళిక చెత్తగా ఉందని, ఆదరాబాదరాగా అలు చేశారని మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం చేసిన విమర్శలను జైట్లీ తిప్పికొట్టారు.

arun-jaitly-finance-minister-demonetization

అవినీతి, నల్లధనం విషయానికి వచ్చేసరికి మనమేవిూ చేయలేమనే నిర్లిప్త వాతావరణంలో మనం (దేశప్రజలు) జీవనం సాగిస్తూ వచ్చారన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి, అట్టడుగు వర్గాల్లో నిస్సహాయత కనిపించేదని జైట్లీ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం, గతంలో ఉన్న చట్టాలను లోతుగా అధ్యయనం చేసి కట్టుదిట్టమైన అమలుకు నడుం బిగించిందని, నల్లధనం వ్యతిరేక పోరాటాన్ని సమర్థవంతంగా మూడేళ్లుగా అమలు చేస్తోందని జైట్లీ తెలిపారు.

పెద్ద నోట్ల రద్దుతో స్వల్ప, మధ్యకాలిక ఫలితాలు సానుకూలంగా వచ్చాయని,ముఖ్యంగా నగదు చలామణిని తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి నల్లధనం ప్రవాహాన్ని నిలువ రించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసిందని జైట్లీ అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నట్టు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు.

arun-jaitly-finance-minister-demonetization

నోట్ల రద్దు పీరియడ్‌లో సేకరించిన డాటా ప్రకారం 2.97 లక్షల బోగస్‌ కంపెనీలను గుర్తించామని చెప్పారు. అనంతరం నోటీసులు పంపి 2.24 లక్షల కంపెనీల రిజస్టేష్రన్లను రద్దు చేశామని తెలిపారు. బ్యాంకు అకౌంట్లు స్తంభింపజేయడం, బోర్డ్‌ ఆఫ్‌ కంపెనీల నుంచి డైరెక్టర్లను డిబార్‌ చేయడం జరిగిందన్నారు.

డిజిటల్‌ పేమెంట్ల పరంగా చూసినప్పుడు రూ.3.30 లక్షల కోట్లు విలువచేసే 110 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. మరో 3.30 లక్షల కోట్ల మేరకు క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా లావాదేవీ లు జరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్వే ఘటనలు, దేశంలోని కొన్ని జిల్లాల్లో నక్సల్‌ కార్యకలాపాలు తగ్గాయని ఆయన చెప్పారు.

నకిలీ భారత కరెన్సీ ప్రవాహానికి అడ్డుకట్ట పడిందని తెలిపారు. తాము చేపట్టిన చర్యలవల్ల నిజాయితీ, పారదర్శక ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ పురోగమిస్తోందని జైట్లీ వివరించారు.

 arun-jaitly-finance-minister-demonetization

నరేంద్ర మోడీ చేపట్టిన రూ.500/- ,రూ.1000/- పెద్ద నోట్ల రద్దు వలన దేశానికి కలిగిన ప్రయోజలు ఏమిటో చూస్తే! 


1. 18 అనుమానిత బ్యాంకు అకౌంట్స్ ని గుర్తించటం జరిగింది

2. 2.89 లక్షల కోట్ల బ్యాంకు డిపాజిట్ ల మీద నిఘా పెట్టటం జరిగింది .

3. 4,73,003 అనుమానిత బ్యాంకు లావాదేవీలు గుర్తించటం జరిగింది .

4. 29,213 కోట్ల ను ఇన్కమ్ టాక్స్ పరిధి లోకి తీసుకు రావటం జరిగింది .

5. 16,000 కోట్ల నల్ల ధనాన్ని ఇప్పటివరకు గుర్తించటం జరిగింది .

6. దేశంలో నగదు వాడకాన్ని 21% వరకు తగ్గించటం జరిగింది .

arun-jaitly-finance-minister-demonetization

7. షెల్ కంపెనీల (కంపెనీ చట్టం క్రింద నమోదు కాబడి ఎటువంటి లావాదేవీలు జరపని    కంపెనీలు)  అనుమానిత లావాదేవీలు 3,00,000 వరకు గుర్తించటం జరిగింది 

8. 2.1 లక్షల కంపెనీలని కంపెనీల లిస్టు నుంచి తొలగించటం జరిగింది .

9. 400 బినామి లావాదేవి ద్వార 800 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులని అటాచ్ చేయటం జరిగింది .

10. 3 లక్షల కోట్ల నూతన బ్యాంకు డిపాజిట్ లు సేకరించటం జరిగింది .

11. నూతన డిపాజిట్ బ్యాంకులు సేకరించటం వలన బ్యాంకులు వడ్డీ రేట్స్ తగ్గించటం జరిగింది

12. ఒక కోటి మంది కార్మికులను ఈ.పి.ఐ మరియు ఈ.ఎస్.ఐ.సి పరిధి లోకి తీసుకు రావటం జరిగింది.

arun-jaitly-finance-minister-demonetization

13. 56 లక్షల మందిని నూతన ఆదాయపు పన్ను పరిధి లోకి తీసుకు రావటం జరిగింది .

14. పీపుల్స్-వార్ సభ్యులు ప్రజలని బెదిరించి వసూలు చేసిన వేల కోట్ల డబ్బులు నరెంద్ర మోడీ  ఒక్క నిర్ణయంతో ఆవిరి అయ్యాయి. ఆ వేల కోట్ల రూపాయలు టెర్రరిస్ట్  కార్యకలాపాలకి ఉపయోగ పడకుండా పోయాయి .

15. పెద్ద నోట్ల రద్దు వలన కాశ్మీర్ లోని టెర్రొరిజం కొంత అదుపు లోకి వచ్చింది

16. దేశంలో మతమార్పిడులు ప్రోత్సహించి విదేశాలనుంచి వచ్చే ధనం కూడా ఆగి పోయింది .

17. మన దేశ ఆర్ధిక వ్యవస్థలో చలామణి లో ఉన్న నకిలీ నోట్లను ఒక్క నిర్ణయం తో ఏరి పారేసాడు .

18. దేశంలో హవాల ద్వార విదేశాల నుంచి డబ్బు ఇప్పుడు రావటం లేదు

arun-jaitly-finance-minister-demonetization

arun-jaitly-finance-minister-demonetization
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నాస్కాం సంస్థ ఒప్పంధం
రాశీ ఖన్నా దశ తిరిగింది
ఐటి కారిడార్ కు మణిహారంగా రానున్న మోనో-రైల్
'చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు' చేరిన బాంకింగ్ వ్యవస్థ
శబాష్ సింగపూర్! ప్రజలకు బోనస్ యివ్వటం అద్భుతం
ఎడిటోరియల్: ఉండవల్లి అపరచాణక్యుడు ఒక దెబ్బకు అన్నీ పిట్టలు వల్లో పడ్డాయి!
ఒకరు మరొకర్ని గెలిపించటమే సెక్స్ - ఇద్దరూ గెలిచే ఆటే శృంగారం
పుణే నుండి నవి ముంబాయికి 25 నిమిషాలలో ప్రయాణించండి: హైపర్‌లూప్‌-ట్రైన్
భానుమతి పాత్రలో భాగమతి - మహనటి సినిమాపై జమున షాకింగ్ కామెంట్స్
"నాడు మామకు...నేడు మోడీ" కి...వెన్నుపోటు..?
ఇది జన హృదయం మిస్టర్ పవన్ కళ్యాణ్ - పరువు ప్రతిష్ఠ జాగ్రత్త
అమరావతి ప్రజా రాజధానా?  రియల్-ఎస్టేట్ వ్యాపారమా ? మయసభా భవనమా ?
పవన్ కళ్యాణ్ నీతి నిజాయతి నిబద్ధత
ముఖ్యమంత్రి ₹16000 కోట్ల లెక్క చెప్పి, బాలన్స్ కేంద్రాన్ని అడగొచ్చు కదా!
భారత్ లోనే అతి పెద్ద అవినీతిపరుడు చంద్రబాబు: ఎంపీ మేకపాటి
అవకాశాలకోసం హీరోయిన్లు తమను తాము ఆఫర్ చేసుకుంటున్నారు - ఎక్తా కపూర్
నిశ్శబ్ధంగా సినీ రంగంలో ప్రవేసించి విస్పోఠనం సృష్టిస్తున్న 'తొలిప్రేమ' కథానాయకి
About the author