ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి?  అని అడగండి ........ వ్యవసాయ కూలీలు దొరకడం లేదు అంటారు.

ఒక హోటల్ యజమానిని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి? అని అడగండి ......... కుక్స్, వైటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు.

ఒక వస్త్రదుకాణానికి వెళ్ళి మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి? అని అడగండి ... కౌంటర్ లో సహకరించే అసిస్టెంట్లు దొరకడం లేదు అంటారు.

swami vivekananda quotes in telugu కోసం చిత్ర ఫలితం

ఒక ఉద్యోగిని ఐన గృహిణిని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి? అని అడగండి........ సరైన పని మనుషులు దొరకడం లేదు అంటారు.

ఒక మోటార్ సర్వీస్ స్టషన్ యజమానిని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి? అని అడగండి ......సరైన మెకానికులు దొరకడం లేదు అంటారు.

ఒక కంపెనీ యజమానిని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి? అని అడగండి ...సరైన డ్రైవర్లు, బిల్డింగ్ నిర్వాహణకు సహాయకులు దొరకడం లేదు అంటారు.

dignity of labour కోసం చిత్ర ఫలితం

"అసలు ఈశాన్య భారతదేశంవారు ఉండ బట్టి మనం బ్రతకగలుగుతున్నాం! లేక పొతే పెద్ద మొత్తం ఉభయ రాష్ట్రాలు విపత్తును ఎదుర్కోవలసి వచ్చి వుండేది" అని మొన్న కేరళ లో ఒక హోటల్ యజమాని అన్నాడు. ఒక  భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, సిమెంట్ పని మేస్త్రీలు, నిపుణులైన శ్రామికులు, సాధారణ శ్రామికులు దొరకడం లేదు అంటారు.


నేను లండన్ వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో పురోహితుడు, వంటవారు, నమ్మకస్తులు కావాలి - దొరకడం లేదు సాయం చెయ్యండి - అని అక్కడివారు అడిగారు.


ఒక పక్క భారత దేశం "నిరుద్యోగ సమస్య" ఎదుర్కుంటుందని ఆ సమస్య తీవ్రంగా వుంది అనుకుంటున్నాం. మరో పక్క అన్ని రంగాల్లో  "సరైన నైపుణ్యం" ఉన్న "పని మంతులు" (స్కిల్డ్ లేబర్)  దొరకడం లేదు. ఇది వివిధ విభిన్న రంగాల నుండి వినిపించే మాట. రోజువారి సాధారణ అవసరాలను నిర్వహించటానికి "కొంత నైపుణ్యం" (సెమి స్కిల్డ్)  ఉన్న నిపుణుల అవసరం అలభ్యత గురించి అందరూ చెబుతున్నారు. ఈ ఏకత్వంలోని భిన్నత్వం లేదా వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


హోటల్స్ లో మెయిన్ కుక్, టీ మాస్టర్, దోసే మాస్టర్ కు ఇరవై వేల నుండి ముప్పైవేల వరకు ప్రారంభ జీతం వుంది . అదే ఇంజనీర్లు పది వేల జీతానికి కూడా "క్యు" లో నిల్చుంటున్నారు. విద్యావంతులకు ఉద్యోగాలు దొరకటం లేదు. గ్రామీణ పట్టణ క్రింది, మద్యతరగతి ప్రజల అవసరాలు తీర్చటానికి  "పనిమంతులు" (పనిమంతు లంటే - నిపుణులు లేదా పనితెలిసిన వారు లేదా పని నేర్చుకున్నవారు అని అర్ధం) దోరకట్లేదు.  కాదు పని కోసం ప్రయత్నించట్లేదు. లేదా నైపుణ్యం కోసం కొంతైనా కష్టపడటం లేదు దానికి కూడా ప్రయత్నించటం లేదు. తొలుత పని కల్పించుకోవాలి. తరవాత పని దొరుకుతుంది. ఆ తరవాత పని మన వెంటపడుతుంది. లేకుంటే తను మనకోసం నిరీక్షిస్తుంది పరుగెత్తిస్తుంది వేటాడుతుంది.

swami vivekananda quotes in telugu కోసం చిత్ర ఫలితం

"దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కడా లేదు"  అసలు సమస్య ఎక్కడ వుంది, అంటే అసలు నిరుద్యోగం మన మనసులోని ఆలో చనా విధానంలో ఉంది. అందరికి "వైట్ కాలర్ జాబ్" కావాలి (టేబుల్ కుర్చి పైన ఫాన్ ప్రక్కన ఫోన్ లేదా ఏసి కారు మొద లైన సౌకర్యాలతో కూడిన పని అన్నమాట) జీతం ఎక్కువ వస్తుంది అని కూడా కాదు. చాల "సెమి స్కిల్ల్డ్ జాబ్స్" (కొంత నైపుణ్యం తో కూడిన ఉద్యోగం) అంతకు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది  ఈ రోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేల రూపాయలు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ జీతం నలభై వేల రూపాయలు. 


అసలు ప్రపంచ దేశాలు ఉపాద్యాయ వృత్తికి,  వైద్య వృత్తికి ఇచ్చే గౌరవం మన దేశం ఇవ్వట్లేదు. కారణం ఆ రెండు వృత్తుల లో ఉన్న కొందరి సామాజం పట్ల దుష్ప్ర వర్తన. ఎంతో ఉన్నతులుగా వారిని వారు ఊహించుకోవటమే కారణం. ఒక మెకానిక్ వారి కారుని సరిగా రిపేరు చెయ్యకపోతే మెకానిక్ విలువ వీరికి తెలుస్తుంది. వీళ్ళు మెడిసిన్ చదివారు కాని వీరు కోంతైనా సమాజ శాస్త్రం (సోషియాలజి) మనస్తత్వశాస్త్రం (సైకాలజీ) కూడా చదవటం అవసరం.  ప్రతి పని మానవ అవసరాలు తీర్చ టానికే. అది తెలుసుకొని మెదిలితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువ తెలిసి అన్నీ వృత్తులు సమాజ శ్రేయస్సుకే నని అర్ధమౌతుంది.  

telugu quotes most success ful women wants కోసం చిత్ర ఫలితం

మనవారు ఒక్కో జాబ్ కు ఒక్కో "సోషల్ స్టేటస్" (సామాజిక స్థాయి) అంట గట్టేసారు. ఇంజనీర్, డాక్టర్  అంటే చాలా గొప్ప ఉద్యోగం. టీచర్ అంటే ఏదో "పనికి రాని జాబ్" అని.  ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను - అంటే పెళ్ళి చేసుకోవటాని కి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహిత్యం అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకురాని పరిస్థితి. అందుకే తెలంగాణా ప్రభుత్వం పురోహితులను పెళ్ళిచేసుకుంటే అమ్మాయి లకు ప్రోత్సాహకాలు ప్రదర్శించిన దుస్థితి. 


కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం "ప్రెస్టేజ్-సోషల్ స్టేటస్"  కోసం పని చేసేవారు వున్నారు . అదే హోటల్ లో కుక్ గా, వెయిటర్ గా చెయ్యమంటే అదేమో అవమానం,  నామోషీగా తలతీసినట్లు  ఫీల్ అవుతారు. ఇదే మన వారు అమెరికాకు వెళితే అక్కడ హోటళ్ళలో, గాస్ స్టేషన్లలో, కిరాణా షాపుల్లో పని చెయ్యడానికి సిద్ధ పడుతారు. 


అంటే ఇక్కడ మారాల్సింది  మన ఆలోచన  "సామాజిక దృక్పధం"  దొంగతనం, బిక్షమెత్తుకోవటం, సమాజ వ్యతిరేక పనులు చేయటం తప్ప, ఏ పని చేసినా ఒకటే! తప్పు లేదు కదా! అన్ని పనులు గొప్పవే. మన అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తున్న మనవాళ్ళు కు ఇప్పుడు ట్రంప్ అడ్డుపడ్డాడు. ఇక్కడ ఉద్యోగం లేదు. దారిన పొయ్యే వారు ఎం బాబు ఉద్యోగం లేదా? అంటూ కాకుల్లా పొడుచుకొని తింటున్నారు అని మనం అనవసరంగా ఫీల్ కావలసిన అవసరం లేదు. ఏపనైనా ఏ విద్యావంతుడైనా నైపుణ్యం సాధించి చేయవచ్చు (కొన్ని అతి సాంకేతికత తో కూడినవి తప్ప)

సంబంధిత చిత్రం


ముందుగా మన మనసుకు నచ్చిన వృత్తిని పనిని ఎంచుకోవాలి. అతిచిన్న ఉద్యోగమైనా పరవాలేదు. చేతినిండా పని ఉండాలి. మంచి పనిమంతునికి ఎంతో కొంత ఆదాయం  వస్తుంది. చేస్తున్న పనిని ప్రేమించే సుగుణం మనలో ఉండాలి. అదే మనకు ఉండవలసిన "క్వాలిఫికేషన్ లేదా విద్యార్హత"  పనిపై మనసు లగ్నం చెయ్యాలి. దొరికిన పని అనే నిచ్చెనపై అంచెలంచెలుగా ఎదగాలి. దాన్ని నిరంతర ప్రక్రియగా మార్చుకోవాలి అప్పుడు మీరు ఉద్యోగిగానే ఉండరు పది మందికి ఉపాధి కల్పించే యజమాని స్థాయికి చేరుకోగలుగుతారు.


quotes of vivekananda in telugu కోసం చిత్ర ఫలితం


పాన్ డబ్బా పెట్టుకొన్నా పరవాలేదు.

కర్రీ షాప్ పెట్టుకొన్నాపరవా లేదు.

ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నా పర్వాలేదు.

టిఫిన్ సెంటర్, లంచ్ వాన్, స్నాక్స్ కారు, పికిల్స్ ట్రక్, నైపుణ్య అభివృద్ది ట్రైనింగ్ సెల్,  చిన్న పని వారల సరపరా, గృహ అవసరాలు తీర్చే కాల్ సెంటర్, జీరాక్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ సెంటర్ ఏదైనా ఫరవాలేదు. ఇక్కడ "మీరే రాజు   మీరే మంత్రి" డిప్రెషన్ శుద్ధ అనవసరం. కావలసిందల్లా ఆత్మ విశ్వాసం, కృషి, పట్టుదల, మారిన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం, మారుతుండటం కావలసిన ఎక్స్-ట్రా  విద్యార్హతలు. ఇది వ్యక్తిత్వం లో మార్పు తెచ్చుకోవటం మాత్రమే. 


వీడియో గేమ్స్ ఆడుతూ, కాల్ క్షేపం కోసం నెట్ పై సంచరిస్తూ, ట్రంప్ కరుణిస్తాడు, అమెరికా అవకాశాల కోసం ఎదురు చూడ్డం కాదు నేటి యువత చేయవలసింది. అవకాశాన్ని వెతుకొంటూ మనమే వెళ్ళాలి. తొలిసారి మనం వెళితే ఆ తరవాత అవకాశా లు మనకెదురౌతాయి. ఙ్జానం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, హృదయా నికి దన్ను మనలోనే ఉంది. ఇవన్నీ చేయ కుండా ఉంటే మన మనసు దెయ్యాల కొంప అవుతుంది. ఇక రోడ్ రోమియోస్, పోకిరీస్, ఇడియట్స్, లోఫర్స్ తయారై గల్లీ గాంగ్ లకు నాయకత్వం వహిస్తూ అమ్మాయిలను లైంగిక వేదింపులకు గురిచేసే సమాజిక వ్యతిరేఖ వ్యక్తులుగా తయారౌతాం.  16 సంవత్సరాలకే నీ బ్రతుకు నువ్వే బ్రతుకు అనే సామాజిక పరిస్థితులు నెలకొని ఏదో పని దొరికించుకున్న వాణ్ణి సమాజం వాడు చేసె పనికి విలువ ఇచ్చి గౌరవిస్తే దేశం లో నిజంగా చెప్పాలంటే సంఘవిద్రోహ శక్తులే తయారవ్వరు 

సంబంధిత చిత్రం

అమెరికా లో వెళ్ళగానే ఏదో అక్కడ భూలోక స్వర్గం ప్రత్యక్షమవదు. అంతకు పది రెట్లు ఇక్కడే సంతోషంగా బతకవచ్చు. ఎక్కువ చెబితే అక్కడ ఉన్న మిత్రులు ఫీల్ అవుతారు. అక్కడ అవకాశం వస్తే వెళ్ళండి. కానీ దాని కోసమే ఎదురు చూస్తూ, అది రాకపోతే జీవితమే ఐపోయినట్లు వ్యధ పడుతూ కూర్చోవాల్సిన అవసరంలేదు.


ఈ రచయితను జీవితంలో స్థిరపడి పొయ్యారు సారు! మీరు ఏదైనా చెబుతారుఅనుకొంటున్నారా?  మళ్ళి కొత్తగా జీవితాన్ని ప్రరంభిస్తే అలా చెయ్యాల్సి వస్తే మన మహానగరం లో ఒక మూల లక్ష ఖర్చుతో చిన్న హోటల్ పెట్టి నేను వంటవాడు గా మారి వంట చేసి ".. తింటే ఈ హోటల్ లోనే తినాలి" అనే స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఉంది. పనిమంతుని దగ్గరికే పని వచ్చే రోజులివి. అభివృద్ది దానంతట అదే వస్తుంది. డబ్బు వెనక పరుగెత్తని వాడికి - "పని వెంట నాణ్యత వెంట పరుగెత్తే వాడికి ప్రపంచం దాసోహం అంటుంది" పని సంకృతిని పెంచి పోషిస్తా - పనిని ఎంజాయ్ చేస్తా! "నా వంట తిన్న వారి ఆనందం  నాకు ముఖ్యం" పేరు డబ్బు చచ్చినట్టు మనలను వెంటాడుతాయి. ప్రతిపనిలో దైవం ఉన్నాడు. పనిని ప్రేమిస్తే చలు. ధన, కనక, వస్తు, వాహన గృహ వసతులు గృహాక్ష్మితో సహా మనవెంటే పడతాయి.

anr ntr brought image to film industry కోసం చిత్ర ఫలితం

పదిసార్లు స్వయంకృషి, పెళ్ళిచూపులు సినిమాలు చూడండి పనికి వ్యక్తుల ద్వారా విలువ ఎలా ఆపాదించబడుతుందో తెలు స్తుంది. ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్ రంగప్రవేశం చేశాకే సినిమావాళ్లకు గౌరవం ప్రతిష్ఠ పెరిగాయి అంటే సినిమావాళ్ళ కి "డిగ్నిటి ఆఫ్ లేబర్" వచ్చిందన్నమాట. ఒకప్పుడు నాగేశ్వరరావుకు సినిమావాడని పిల్లనిచ్చి పెళ్ళిచేయటాని కి ఇవ్వటాని కేవరూ సాహసించలేదు. ఇప్పుడు ప్రభాస్ కు 6000 అప్లికేషన్లు వచ్చాయట అమ్మాయిల నుండి. 


ఉదాహరణకు ఒక నిజమైన సంఘట్టన చెపుతాను ఇది నిజంగా నిజం: 

మా చిన్ననాటి మిత్రుడు అంటే మాది ఏభై సంవత్సరాల స్నేహం. పారిశుద్ధ్య పని చెసే కుటుంబం లో పుట్టి అందులో మెళుకువలు వంటపట్టించుకొంటూ పెరిగాడు. పదవ తరగతి తర్వాత విడి పోయినా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం.


పారిశుధ్యపనులతో పాటు అవసరమైన వస్తు సరపరా, పనివారల సరపరా చేస్తూ ఎదిగాడు ఎలా అంటే,  చీపుర్లు సేకరించటం నుండి ప్రారంభించి,  పినాయిలు, ఫ్లావర్లు తయారీ చిన్న పరిశ్రమలు స్థాపించి “ నాణ్యత తగ్గకుండా తయారీ”  చేసి తన 35 వ సంవత్సరానికే 50 కోట్ల రూపాయిల టర్నోవర్ సాధించి ఉత్సాహంగా అనేక సేవా సంస్థలకు గుప్తదానాలు చేస్తూ నేడు  100 కోట్ల రూపాయల విలువైన సంపదలకు  యజమానైనాడు. నేను మాత్రం బాంక్ ఉద్యోగిగా రిటైరై, టైరైపోయి ఉంటే, వాడు తన 14 యేటనే ప్రారంభించిన సంస్థను వ్యవస్థగా మార్చి 4000 మందికి పనిచ్చి పని సంస్కృతిని గౌరవిచ్చాడు. 


నేడు తన ఒకే కూతురు కోరిక మేరకు తన వ్యాపారాన్ని ముగించి తన అల్లుడు తో "ఇన్వెస్ట్మెంట్ బాంకింగ్" ను స్థాపించి ఉత్తర భారతంలో అద్భుతంగా జీవిస్తున్నాడు సకుటుంబంగా. అన్నింటా తన సహధర్మచారిణి సహకారం మరచి పోలేనంటాడు. 


telugu quotes most success ful women wants కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: