అమిత్ షా అద్భుతమైన ప్లాన్ చేస్తే అది వర్క్ అయ్యి తీరాల్సిందే అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు . ఇప్పుడు అదే జరుగుతోంది. మోడీ రాజకీయ చతురత తో వేసిన స్టెప్ వెనకాల అమిత్ షా ఉంటారు అని తెలిసిందే అందరికీ. తమిళనాట అడుగు పెట్టాలి అనే మోడీ ప్లానింగ్ కి కరుణానిధి నిన్న తమ 'పెద్ద నోట్ల రద్దు నిరసన ' ని వెనక్కి తీసుకోవడమే అంటున్నారు.

రెండు రోజుల క్రితం చైన్నై వెళ్లిన మోదీ... డీఎంకే అధినేత కరుణానిధి నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించారు. అంతేకాదు, "మీరు ఢిల్లీ వచ్చి నా అధికార నివాసంలో ఉంటారా? నా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారా?" అంటూ కరుణను అడిగారు. ఇదంతా కూడా బీజేపీ భవిష్యత్తు రాజకీయాల కోసం అని స్పెషల్ గా చెప్పక్కర లేదు.

మోడీ ఏకంగా కరుణ ని డిల్లీ వరకూ రమ్మన్నారు అంటే మోడీ వెనుక రాజకీయ కోణం చాలానే ఉంది అని చెప్పవచ్చు. 2004 దాకా బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేలో డీఎంకే భాగస్వామిగా ఉండేది. ఆ తర్వాత యూపీఏ వైపు మళ్లారు కరుణానిధి. డీఎంకేతో రాజకీయ పొత్తు బీజేపీకి అవసరం కాగా... కేసుల నుంచి బయటపడటానికి బీజేపీతో స్నేహం డీఎంకేకు అవసరమని విశ్లేషకులు అంటున్నారు.

కనిమొళి, దయాళు అమ్మాళ్, కరుణ బంధువర్గం, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తదితరులు నిందితులుగా ఉన్న 2జీ స్పెక్ట్రం కేసు కొద్ది రోజుల్లోనే తుది విచారణకు రానుండటం గమనార్హం.మోడీ రాజకీయ మంత్రాగం వర్క్ అయ్యింది అనీ త్వరలో డీఎంకే మోడీఎంకే అవబోతోంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: