ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ని ఓపెన్ గా బహిష్కరించారు జగన్ మోహన్ రెడ్డి .. పాదయాత్ర లో ఉన్నారి కాబట్టి దానికి తన ఎమ్మెల్యే లు అందరూ తనతోనే ఉండాలి అని అనుకున్న జగన్ అసెంబ్లీ ని బహిష్కరించే ప్రోగ్రాం పెట్టారు. దానికోసం ఎమ్మెల్యే ల ఫిరాయింపులు అనే కాన్సెప్ట్ ని చాలా చక్కగా వాడుకుని పర్ఫెక్ట్ గా ప్ర‌జ‌ల‌కు చూపించిన కార‌ణం ఏంటంటే… ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించే వ‌ర‌కూ స‌భ‌లోకి అడుగుపెట్ట‌మ‌న్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలాంటి మాట మాట్లాడినా, ప్లాన్ వేసినా ఏదో ఒక రకంగా సమాధానం చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ మాస్టర్ స్ట్రోక్ నిర్ణయం విషయం లో మాత్రం తటపటాఇస్తున్నారు. ఫిరాయింపుల్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్టు మాట్లాడ‌లేక‌, అలాగ‌ని స‌మ‌ర్థించుకోకుండా ఉండ‌లేక కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాట వాస్త‌వ‌మే.

అందుకే, ఈ విష‌య‌మై రోజుకో ర‌క‌మైన వాద‌న‌ వినిపిస్తున్నారు. రీసెంట్ గా మాట్లాడిన మంత్రి ఆదినారాయణ రెడ్డి కావచ్చు మరెవరైనా కావచ్చు కనీ వైకాపా ఫిరాయింపుల విషయం లో ఎలాంటి ఆన్సర్ చెప్పాలో తెలీక ఉన్నారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన‌ శాస‌న స‌భ్యుల రాజీనామాను స్పీక‌ర్ అంగీక‌రిస్తే, తాము ఉపఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ ఫార్మాట్ లోనే ఇదివ‌ర‌కే అంద‌జేశామ‌ని చెప్ప‌డం విశేషం! 

తన మీద జగన్ గానీ అతని అనుచరులు, కుటుంబంలోని వారు ఎవరైనా ఎదురు నిలిచే సీన్ ఉందా అంటూ సవాల్ విసిరారు. ఫిరాయింపుల మీద ఎప్పటికప్పుడు ఆన్సర్ లు చెప్పలేక దొరికిపోతోంది టీడీపీ వారి క్యాడర్. ఇదే మాట అన్న టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి కి క్లోజ్ గా ఉండే అమరనాథ్ రెడ్డి గత నెల మరోలా అన్నారు. స్పీకర్ ఆమోదం లేకపోతే మేమేం చేస్తాం అంటూ వ్యాఖ్యానించారు అప్పుడు. ఎటూ వెళ్ళే ఛాన్స్ లేక డిఫెన్స్ కూడా లేకుండా అయిపోయింది టీడీపీ ఈ విషయం లో మాత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: