హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో 337 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 40 వేలమంది పోలీసులు, భద్రతాసిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు.  ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు 54.9 శాతం ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.
101-year-old Sharan Negi after casting his vote. S Chauhan/Firstpost
ఓట్లు వేయ‌డానికి ఓట‌ర్లు ఉత్సాహం చూపుతున్నారు.జేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ కూడా పోలింగ్‌ మొదలైన తొలి గంటలోనే తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండగా హిమాచల్‌ ఎన్నికల్లో ఈ దఫా తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌,  ఎలాగైనా పవర్‌లోకి రావాలనీ బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
Image result for himachal pradesh elections
ఇరు పార్టీలు మొత్తం 68 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాయి. ఓట్లు వేయ‌డానికి ఓట‌ర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఆ రాష్ట్రంలోని మ‌నాలీలోని బాషింగ్ గ్రామంలో ఓ యువ‌కుడు ఓ వైపు పెళ్లి పెట్టుకుని పెళ్లి దుస్తుల‌తోనే ఓటు వేయ‌డానికి వ‌చ్చి ఆద‌ర్శంగా నిలిచాడు.
Image result for himachal pradesh elections
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి మహాసు పార్లమెంటరీ నియోజకవర్గానికి(ప్రస్తుతం మండి) జరిగిన ఎన్నికల్లో నేగి(1951 అక్టోబర్ 25న) తన ఓటు హక్కును వినియోగించుకుని, దేశంలోనే తొలి ఓటు వేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థులైన వీరభద్రసింగ్‌, ధుమాల్‌ కూడా ఈసారి తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు రసీదు యంత్రాలను (వీవీప్యాట్‌లను) వాడనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: