రాజ‌కీయాల్లో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు కామ‌నే! అయితే, సంద‌ర్భాన్ని బ‌ట్టి ఆ స‌వాళ్ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డ‌డం విశేషం. నిన్న‌టికి నిన్న జ‌గ‌న్ సంచ‌ల‌న స‌వాల్ విసిరారు. త‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అనేక విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన  టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి గ‌తంలో ఎన్న‌డూ ఆయ‌న ఇంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఇన్నాళ్ల‌లో ఎప్ప‌డు రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని ఏనాడూ జ‌గ‌న్ అన‌లేదు. బాబు ఏదో ఒక కామెంట్ చేయ‌డం, దానికి ప్ర‌తిగా జ‌గ‌న్ కూడా కామెంట్ల‌తో విరుచుకుప‌డ‌డం తెలిసిందే. కానీ, అనూహ్యంగా చంద్ర‌బాబు రెండు రోజుల కింద‌ట చేసిన ఓ కామెంట్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. 

Image result for CHANDRABABU & JAGAN

ప్యార‌డైజ్ పేప‌ర్స్ విష‌యానికి సంబంధించి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు త‌న‌పై చేసిన కామెంట్ల‌ను జ‌గ‌న్ స‌వాల్ చేశారు. తాను విదేశాల్లో కోట్లు కూడ‌బెట్టిన‌ట్టు ప్యార‌డైజ్ ప‌త్రాల్లో వెల్ల‌డైంద‌ని బాబు అన్నార‌ని, అలా విదేశాల్లో త‌న‌కు ఆస్తులు ఉన్న‌ట్టు నిరూపిస్తే.. రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని లేకుండా బాబు సీఎం సీటుకు రాజీనామా చేయాల‌ని దీనికి ప‌ది హేను రోజుల గ‌డువు కూడా ఇస్తున్నాన‌ని ఆయ‌న అన్నారు. గ‌తంలో ప‌రిస్థితుల‌ను పోల్చుకుంటే జ‌గ‌న్ చేసిన స‌వాల్ చాలా సంచ‌ల‌నం సృష్టించింది. సాక్షి పెట్టుబ‌డుల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ ఇలా స్పందించ‌లేదు. 

Image result for CHANDRABABU & JAGAN

కానీ, అనూహ్యంగా ప్యార‌డైజ్ ప‌త్రాల‌పై మాత్రం స‌వాల్ రువ్వారు. మ‌రి దీనిని చంద్ర‌బాబు స్వీక‌రిస్తారా? అనేది రాజ‌కీయ వ‌ర్గాలు జోరుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. నిజానికి గ‌తంలోనూ జ‌గ‌న్ తండ్రి వైఎస్ విసిరిన స‌వాళ్ల‌ను కూడా బాబు స్వీక‌రించ‌లేదు. ఇప్పుడు కూడా అంతే అంటున్నారు విశ్లేష‌కులు. ఒక‌వేళ జ‌గ‌న్ స‌వాలును స్వీక‌రించిన‌ట్ట‌యితే... బాబు వాటిని ఆధారాల‌తో స‌హా నిరూపించాలి. కానీ, అది జ‌రిగేప‌నికాదు. కాబ‌ట్టి.. స్వీక‌రించి ప్ర‌యోజ‌నం లేదు. కాబ‌ట్టి మౌనం త‌ప్ప‌మ‌రో మార్గం లేదు. అయితే, ఇక్క‌డే జ‌గ‌న్ నుంచి మ‌రో చిక్కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. తాజా స‌వాల్‌ను బాబు స్వీక‌రించ‌క‌పోతే.. జ‌గ‌న్‌పై భ‌విష్య‌త్తులో ఎలాంటి విమర్శ చేసినా.. ప్ర‌తి విమ‌ర్శ‌లు భారీగా ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనిని బ‌ట్టి జ‌గ‌న్.. బాబును భ‌లేగా ఇరికించాడ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: