ఫిరాయింపుల నేతల యొక్క భవిష్యత్తు ఏ టైం లో ఎలా ఉంటుందో తెలీని పరిస్థితి. ఒక్కొక్క సారి ఒక్కొక్క రీతిగా ఉంటాయి వారి రాజకీయ ఐడియా లు. అధికార పక్షం కదా కనీసం ఫండ్స్ అయినా దొరుకుతాయి అనుకుని వస్తారు చాలా మంది. అయితే కొందరు ఫండ్స్ కంటే ఎక్కువగా మంత్రి పదవులనే నమ్ముకుని ఉంటారు గుత్తా సుఖేందర్ లాగా.

తెరాస‌లో చేరితే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన త‌రువాతే గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు అంటారు. పార్టీ మారిన త‌రువాత ప‌రిస్థితి ఏమైందీ..? గుత్తాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే ఊసెత్తే ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం లేదు. గుత్తా కూడా ఎప్పుడూ ప్రభుత్వాన్ని కానీ కెసిఆర్ ని కానీ దీనికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి ఎదురు ప్రశ్నలూ వెయ్యలేదు.

అధికార పార్టీలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌త్యేకంగా ఏం సాధించ‌లేక‌పోయామ‌నే నిర్వేదం గుత్తా  వ‌ర్గంలో కాస్త ఎక్కువ అవుతుంద‌ని తెలుస్తోంది. తెరాస ని బాగానే ఓన్ చేసుకుని హ్యాపీగా కాంగ్రెస్ మీద విమర్శలు బాగా చేస్తున్న గుత్తా లోలోపల బాధ పడుతున్నారు అని ఒక టాక్. మొన్నామధ్య ఆయన నియోజికవర్గం నల్గొండ లో ఆయనతో రాజీనామా చేయించి నెమ్మదిగా ఉపఎన్నిక పెడతారు అనే టాక్ కూడా వచ్చింది కానీ అది జరగలేదు.

అదే జరిగుంటే రాష్ట్రంలో కొత్త‌గా వేసిన రైతు స‌మ‌న్వ‌య క‌మిటీ రాష్ట్ర బాధ్య‌త‌లు ఆయ‌న‌కి అప్ప‌గిస్తార‌నీ, దీనికి క్యాబినెట్ హోదా క‌ల్పిస్తార‌ని కూడా అన్నారు. మంత్రి పదవీ పోయి ఉపఎన్నికా రాక అసంతృప్తి జంపింగ్ నేతగా ఉండిపోయారు గుత్తా అని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: