తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే నరెంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నాయకత్వం ఏర్పడే సూచనలు కనిపించటం లేదు. ప్రతిపక్షాలూ అత్యంత బలహీనంగా తయా రయ్యాయి. మమతా బెనర్జీ, లాలుప్రసాద్ యాదవ్, మూలాయం సింగ్ యాదవ్ &కో, కలవకుంట్ల చంద్రశేఖరరావు గాని ఎలాంటి ప్రత్యామ్నాయం యివ్వలేనిస్థితిలోనే ఉన్నారు. రాహుల్ గాంధి తొలుతఅర్భకుడు కాని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని మీడియా తన ఫీలర్లు పంపింగ్ చేస్తుంది.


ఎదుగుతూ ఉండే వారు నాయకత్వా నికి కాకుండా అనుచరుడుగానే మంచిగా పనికివస్తారు. లేకపోతే పూర్తిగా ఎదిగాకనే ప్రజలు నాయకుడుగా ప్రజలు అంగీకరిస్తారని ప్రజావాణి.  అంతవరకు రాజకీయాలు, పాలన, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండామాట్లాడటం  నేర్పటానికి  ఆయనకు "ట్యూషన్ మాస్టారు" గా మన మాజీ కాంగ్రెస్ నాయకుడు క్రింది నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన రాజకీయ భీష్ముణ్ణి  నియమించబోతున్నట్లు అనిర్వచనీయ ఆకాశవాణి చెపుతుంది.
Related image

కాబట్టి మోడీకి ప్రత్యామ్నాయం లేదు ప్రస్తుతానికి. అదే గుజరాత్ ఎన్నికల సర్వేలో తెలిసింది.  బాజపా ఓటింగ్ శాతం తగ్గటానికి కారణం -హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవాని అనే త్రిమూర్తులే కారణం- అంటున్నారు. విపక్షాల్లో నరెంద్ర మోడీని ఢీ కొట్టగల నాయకత్వం లేకపోవటమే అంటుంది సర్వే. సరైన నాయకత్వం ఉండి ఉంటే బాజపాకి ధారుణ మైన దెబ్బతగిలి ఉండేదట.  


అందువల్ల  గుజరాత్‌లో మరోసారి కమలమే వికసించబోతుందని "ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ సర్వే" మరోసారి స్పష్టం చేసింది. సుదీర్ఘకాలం తరు వాత గుజరాత్‌లో అధికారాన్ని హస్తగతం చేసు కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి భంగ పాటు, నిరాశ తప్పదని సర్వే తెలిపింది. 

Image result for rahul modi shah

అయితే మొదటి సర్వేతో పోలిస్తే, తాజా సర్వే ద్వారా బీజేపీకి  'ఓట్లూ, ఆపై సీట్లు' తగ్గే అవకాశముందని.  కాని గుజరాత్ గెలుపు గుర్రం ఎక్కేది మాత్రం బాజపానే. 


సర్వే ముఖ్యాంశాలు


ఏబీపీ-సీఎస్‌డీఎస్‌-సర్వే అంచనాల మేరకు మొత్తం 182 సీట్లున్న గుజరాత్ విధాన సభలో భారతీయ జనతా పార్టీకి 113 నుంచి 121 సీట్లు వస్తాయి.

అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి  58 నుంచి  64 సీట్లు లభిస్తాయి అని తేలింది.

బీజేపీకి 47 %  ఓట్‌-షేర్‌,  కాంగ్రెస్‌కు 41 % శాతం ఓట్‌-షేర్‌ వస్తుందని సర్వే అంచనా వేస్తోంది. గత సర్వేతో పోలిస్తే బీజేపీ ఓట్‌-షేర్‌ 11%  తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్‌ 12% ఓట్‌-షేర్‌ ను పెంచుకోవడం గమనించాలి .

ఇక  ఉత్తర గుజరాత్‌ లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతా ల్లో కాంగ్రెస్‌ పార్టీ గణ నీయంగా పుంజుకుంది.

సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతా ల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో 
మొత్తం 107 స్థానాలు ఉండడం విశేషం.

మధ్య, దక్షిణ గుజరాత్‌ లో బీజేపీ పూర్తి మెజారిటీ స్థానాలు సాధించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: