ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం పోరాడిన ఎంతో మంది త్యాగధనుల త్యాగం ఫలితంగా తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది.  ఇక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టిన ప్రస్తుతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.  ఆ నాటి నుంచి తెలంగాణ పోరాటం పల్లె పల్లెకూ పాకింది.  మొత్తానికి ఢిల్లీ పీఠాన్ని కదిలించాయి.  కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 
Image result for kcr
తెలంగాణ సాధన లో ముఖ్య భూమిక పోషించిన టీఆర్ఎస్ అధికాంలోకి వచ్చింది. సీఎంగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే తెలంగాణ వస్తే దర్గాకు వచ్చి మొక్కు చెల్లిస్తానని కేసిఆర్ మహబూబ్ నగర్ ఎంపిగా ఉన్న సమయంలో మొక్కుకున్నారు. దీంతో ఆ మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఇవాళ టిఆర్ఎస్ యంత్రాంగమంతా అక్కడ దిగిపోయారు.  సీఎం కేసీఆర్ దర్గా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.  పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి జెపి దర్గాకు పోయిర్రు సిఎం కేసిఆర్.

ఈ సందర్భంగా కాన్వాయ్ లోని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనం  ఢీకొనడంతో ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈ సంఘటనలో గాయపడిన కానిస్టేబుల్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గాయపడిన కానిస్టేబుల్ రవికిరణ్ గా చెబుతున్నారు. ఆయన కీసర పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించేవాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: