గురు బ్రహ్మా..గురు విష్ణు..గురు దేవో మహేశ్వర అంటూ త్రిమూర్తులను గురువుతో పోలుస్తారు.  తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం గురువుకే ఇస్తాం. అలాంటి గురువు స్థానంలో ఉన్న కొంత మంది  సభ్య సమాజం తలదించుకునేలా నీచమైన పనులు చేస్తున్నారు.  గురువు స్థానంలో ఉన్నవారు విద్యార్థునిలతో అసభ్యంగా ప్రవర్తించడం..లైంగిక దాడులు, అత్యాచారాలు చేయడం లాంటివి సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం.  తాజాగా విద్యార్థులు తినే ప్లేట్లతో మలాన్ని ఎత్తించి అతి జుగుప్సాకరమైన పని చేసి వార్తల్లో నలిచారు కొంత మంది ఉపాధ్యాయులు.
Image result for kids mid day meal plates cleans toilets
వివరాల్లోకి వెళితే.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు...టాయిలెట్‌ లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.  మధ్యప్రదేశ్‌, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో గత గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.పాఠశాల యాజమాన్యం చేసిన నిర్వాకాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెప్పారు.
Kids Asked To Clean School Toilet With Mid-Day Meal Plates; Probe Ordered
దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. టాయిలెట్ లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తన కూతురు తెలిపిందన్నారు. అప్పటికే పాఠశాల మూసేశారని, వారిని నిలదీసేందుకే ఆందోళన చేపట్టామని అన్నారు. ఖండించిన యాజమాన్యం: పాఠశాల యాజమాన్యం మాత్రం తమపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది.
Image result for kids mid day meal plates cleans toilets
అయితే ఇది కేవలంల స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌ రాకేశ్‌ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శర్మ విచారణకు ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: