ఇటీవలే  గాడిద మాంసం అమ్మకంతో వార్తల్లోకి వచ్చిన కృష్ణా జిల్లాలో ఇప్పుడు కుక్కల మాంసం కలకలం రేపుతోంది.  విజయవాడ, గుంటూరు నగరాల్లో  బహిరంగంగా రోడ్ల మీద బోర్డులు పెట్టి మరీ గాడిద మాంసాన్ని అమ్ముతున్న విషయం సోషల్ మీడియాలో పలు సంచలనాలు రేపింది.  గాడిద మాంసాన్ని ఆవురావురుమంటూ తింటూ కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు కోర్టు చేత చీవాట్లు తిన్నారు. . గాడిదలను రోడ్డు మీదే వధిస్తున్నారని జంతు పరిరక్షణ సంఘాల వాళ్లు కోర్టుకు ఎక్కడంతో మున్సిపల్ కార్పొరేషన్లకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. 
Image result for గుంటూరు లో గాడిద మాంసం
తాజాగా అడవి జంతువులు, పొట్టేలు మాంసం పేరుతో కుక్కల మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కోడూరు  గ్రామానికి చెందిన కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో తిరిగే కుక్కలను చంపి వాటి మాంసాన్ని పలు హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు పలువురు గుర్తించారు. హోటళ్లలో, రెస్టారెంట్లలో దుప్పి మాంసం, ఇతర అటవీ జంతువుల మాంసం అంటూ చాటుగా అమ్ముతుంటారు కదా.. అది నిజంగా సదరు జంతువు మాంసమేనా? కాదా? అనేది ఎవరికీ తెలియదు. 
dog meat in restaurants - Sakshi
దీన్ని ఆసరాగా చేసుకొని సదరు వ్యక్తులు  కుక్కలను హతమార్చి ఆ మాంసాన్ని అటవీ జంతువుల మాంసంగా నమ్మించి మైలవరం రెస్టారెంట్లలో రూ. 400 కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. పక్కాగా వీరిని పట్టుకోవడం కోసం నిఘా పెట్టిన గ్రామస్థులు నిన్న మధ్యాహ్నం గ్రామ శివారులో ఓ కుక్కను చంపి దాని చర్మం తీస్తుండటం గుర్తించి వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: